Focus on Village Sanitation Works
గ్రామాలలో పారిశుధ్య పనుల పై శ్రద్ధ వహించాలి
డివిజనల్ పంచాయతీ అధికారి ధర్మారాణి
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామపంచాయతీని డివిజనల్ పంచాయతీ అధికారి ధర్మారాణి గురువారం ఆకస్మికంగా సందర్శించారు.గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి,గ్రామాలలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.తడి చెత్త – పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని,గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు,ఇతర వ్యర్థాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు.అలాగే చలివేంద్రాన్ని సందర్శించి,సెగ్రిగేషన్ షెడ్లో కంపోస్ట్ ఎరువు తయారు చేయాలని సూచించారు.నర్సరీని పరిశీలించి,మొక్కలు 100% పెరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు.అనంతరం శెట్పల్లి గ్రామపంచాయతీని సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు.తడి చెత్త – పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు,ఇతర వ్యర్థాలు లేకుండా చూడాలని సూచించారు.చలివేంద్రాన్ని పరిశీలించి,సెగ్రిగేషన్ షెడ్లో కంపోస్ట్ ఎరువు తయారీ చేపట్టాలని తెలిపారు.నర్సరీని పరిశీలించి మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.తదుపరి సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి ధర్మారాణి, శెట్పల్లి సర్పంచ్ సరస్వతి, శెట్పల్లి,టేకుమట్ల పంచాయతీ కార్యదర్శులు ఆర్.ప్రతిభ రాణి, ఆర్.శ్రావణి, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
