Heavy Winds Cause Trouble in Srirampur
శ్రీరాంపూర్ లో భారీ ఈదురు గాలులతో చెట్లు విరిగిపడి ప్రజలకు ఇబ్బందులు
(నేటి ధాత్రి):-(శ్రీరాంపూర్)
నస్పూర్ మండల్ శ్రీరాంపూర్ లో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా శ్రీరాంపూర్ నాలుగో పరిధి లో జరిగిన ప్రమాదం పలు చెట్లు విరిగిపడి ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మంగళవారం భారీ ఈదురుగాలులతో ఒక పెద్ద చెట్టు విరిగి ఇండ్ల పక్కన పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న నాలుగోవ పరిధి కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్, ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మున్సిపల్ సిబ్బంది, స్థానిక యువకులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని చెట్టు కొమ్మలను తొలగించి పునరుద్ధరించారు. ఈ సందర్భంగా విద్యుత్ తీగలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ, వర్షాకాలంలో ప్రమాదకరంగా ఉన్న పాత చెట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ముందస్తు చర్యలు తీసుకుంటే ప్రమాదాలను, నివారించవచ్చని తెలిపారు.
