SIR 2026 Voter Mapping Accelerated
ఎస్ఐఆర్-2026 ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం
ఇంటిింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్న బీఎల్వోలు
పరకాల,నేటిధాత్రి
ఎస్ఐఆర్ 2026 ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.ఈ మేరకు తేది 30ఏప్రిల్ 2026న నిర్వహించిన సమావేశంలో తహసీల్దార్ టి.విజయలక్ష్మి మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి డాక్టర్ కె.నారాయణ పలు ముఖ్య సూచనలు జారీ చేశారు.అధికారుల ఆదేశాల మేరకు బీఎల్వోలు,బీఎల్ఓ సూపర్వైజర్లు ఓటరు జాబితాలో ఇంకా మ్యాపింగ్ కాని ఓటర్ల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించినట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం 70 శాతం నుంచి 90 శాతం వరకు మ్యాపింగ్ పూర్తి అయ్యే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.రాబోయే ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి 100 శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
