May Day Celebrations at LIC Office Narsampet
నర్సంపేట ఎల్ఐసీ శాఖ కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు
నర్సంపేట, నేటిధాత్రి:
మేడే కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేట ఎల్ఐసీ శాఖ కార్యాలయం వద్ద ఎల్ఐసీ ఏఓఐ నర్సంపేట శాఖ అధ్యక్షులు పొనుగోటి సుధాకర్ రావు జెండా ఆవిష్కరించారు. ఎల్ఐసి ఏఓఐ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కొత్తపల్లి రామ్ నర్సయ్య పాల్గొని ప్రసంగించారు. సీఐటీయూ నాయకులు, 10వ విభాగం కార్పొరేటరు హన్మకొండ శ్రీధర్, రైతు సంఘం నాయకులు కుమారస్వామి, మండల నాయకులు మొద్దు రమేష్, విభాగ నాయకులు సాంబరాతి శ్రీనివాస్, అనంతగిరి స్వామి, బూర రమేష్ ,శాఖ కార్యనిర్వాహక అధ్యక్షులు మర్ద గణేష్, శాఖ కార్యదర్శి ఎం.డీ. సుభానుద్దీన్, శాఖ కోశాధికారి కందికొండ రవికుమార్, ఏజెంట్ల సంఘం అధ్యక్షులు రాజబోయిన చంద్రమౌళి, ముఖ్య సలహాదారు నాంపల్లి కొమురయ్య, శాఖ ఉపాధ్యక్షులు ఎడ్డే రఘుపతి రావు, పురాణి రాంబాబు, నాంపల్లి రాంబాబు, ప్రచార కార్యదర్శి అల్లి రవి, కుసుంభ రఘుపతి, శాఖ నాయకులు కుసుమ దుర్గారావు, కుసుంభ బాబూరావు, బాదావత్ అమృ, ఎడ్డే బాబూరావు, కృష్ణమాచార్యులు, ఉద్యోగ సంఘం నాయకులు భిక్షపతి, రమేష్, మల్లేశం తదితరులు హాజరయ్యారు.
8 గంటల పనిదినాన్ని కాపాడుకోవాలని..
కార్మికులు రక్తం చిందించి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని కాపాడుకోవాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించుకునేందుకు ఇంకా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని ఐసీఈయూ ఎల్ఐసీ ఉద్యోగుల సంస్థ కార్యదర్శి బెజ్జంకి బిక్షపతి అన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేట ఐసీఈయూ ఎల్ఐసీ ఉద్యోగుల సంస్థ ఆధ్వర్యంలో గురువారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు జై రత్న ప్రణయ్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యదర్శి బిక్షపతి మాట్లాడుతూ, కార్మిక హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. మూడవ, నాల్గవ తరగతి ఉద్యోగ నియామకాలను తక్షణమే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు ఎం. మల్లేశం, సంయుక్త కార్యదర్శి ఆర్. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
