May Day Protest Against 12-Hour Work Policy
మేడే స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం ఉద్యమించాలి
నర్సంపేటలో బిఆర్టీయు ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు, జెండా ఆవిష్కరణ
12 గంటల పని విధానం సర్కులర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట, నేటిధాత్రి:
మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల కోసం ఉద్యమించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద బిఆర్టియు ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకల్లో పెద్ది పాల్గొని మేడే జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 8 గంటల పని విధానానికి స్వస్తి పలికి 12 గంటల పని విధానం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్ తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను అణచివేసేలా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి రాష్ట్రాల్లో అమలు చేయాలని చూస్తోందని, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.బీఆర్ఎస్,బిఆర్టియు కార్మిక హక్కుల పరిరక్షణకు మరిన్ని పోరాటాలకు సిద్ధంగా ఉన్నాయని, కేసీఆర్ నాయకత్వంలో బిఆర్టియు బలోపేతమైతే నాలుగు లేబర్ కోడ్లను బలంగా ఎదిరించవచ్చని పేర్కొన్నారు. మేడే సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ, ఉమ్మడి వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర కార్మికలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్, నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కలపల్లి రవీందర్రావు, పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ, నాయకులు నామాల సత్యనారాయణ, నల్ల మనోహర్ రెడ్డి, లెక్కల విద్యాసాగర్ రెడ్డి, నాడెం శాంతి కుమార్, శ్రీధర్ రెడ్డి, హమాలీ డివిజన్ అధ్యక్షుడు బొల్లం ప్రసాద్, క్లస్టర్ బాధ్యులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మహిళా విభాగం బాధ్యులు, కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
