వాహనాల తనిఖీలో అనుమానాస్పదమైన నగదు పట్టివేత
– సిరిసిల్ల టౌన్ రగుడు ఎస్.ఎస్.టి చెక్పోస్ట్ వద్ద
– మున్సిపల్ ఎలక్షన్స్ నేపథ్యంలో
– ఎస్ ఎస్ టి, ఏపీవో సమక్షంలో స్వాధీనం
– సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే.కృష్ణ
సిరిసిల్ల(నేటి ధాత్రి):
శుక్రవారం 30-01-2026 ఉదయం సుమారు 07:45 గంటలకు కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల మండలం, రగుడు వద్ద ఉన్న ఎస్.ఎస్.టి చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించబడినవి.
ఈ సందర్భంగా టి.జి 23 ఎ 1524 నంబర్ గల కారును పోలీస్ బృందం ఆపి తనిఖీ చేయగా, కార్ డ్రైవర్/యజమాని గణాచారి సంభాషివ్, తండ్రి శంకరయ్య, నివాసం ఇంటి నం. 6-3-65, మార్కెట్ రోడ్, వేములవాడ పట్టణం, రాజన్న సిరిసిల్ల జిల్లా గల వ్యక్తి, తన కారులో లెక్కలలో లేని మరియు అనుమానాస్పదమైన నగదు రూ. 20,00,000/- (రూపాయలు ఇరవై లక్షలు మాత్రమే) తీసుకెళ్తున్నట్లు గుర్తించబడినది.
ఆ నగదు మొత్తాన్ని ఎన్నికల నిబంధనలు మరియు చట్టపరమైన విధానాల ప్రకారం, ఎస్.ఎస్.టి బృంద ఇన్చార్జ్ జి. ఆనంద్, ఎ.పి.ఓ సమక్షంలో మధ్యవర్తుల (పంచనామా సాక్షుల) సమక్షంలో స్వాధీనం చేసుకోవడమైనది. ఆ నగదు యొక్క మూలం మరియు ఉపయోగ ఉద్దేశ్యం తెలుసుకునేందుకు తదుపరి విచారణ / దర్యాప్తు కొనసాగుతోందని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే.కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
