వేములవాడ నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టి వైపు యువత మొగ్గుచూపుతున్నారు.. వేములవాడ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావు సమక్షంలో వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన పొన్నాల రాజు ఆధ్వర్యంలో యువకులు, మహిళలు సుమారు 100 మంది వరకు బి ఆర్ ఎస్ లో చేరారు..
వారికి చల్మెడ లక్ష్మీ నరసింహారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై పార్టీలో చేరామని తెలిపారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ, చల్మెడ లక్ష్మి నరసింహారావు గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే యువతకు భవిష్యత్తు ఉందని అలాంటి పార్టీని గెలిపించుకొని మూడవసారి కెసిఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి చల్మెడ లక్ష్మీ నరసింహారావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు ఊరడి రాంరెడ్డి, జోగినిపెళ్లి ప్రవీణ్ రావు, మెడికల్ రాజిరెడ్డి, కాసర్ల అరుణ్, తాడెం లచ్చయ్య, కూతురు బక్కయ్య, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.