బిఆర్‌ఎస్‌ లో చేరి తప్పు చేశా?

`రాజకీయం నాశనం చేసుకున్న!?

`సారయ్య మనసులో మాట?

`సారయ్య కపట రాజకీయం?

`తూర్పులో సారయ్య చిచ్చు!?

`సాలయ్యా! సారయ్యా? అంటున్న జనం!?

`బిఆర్‌ఎస్‌ టార్గెట్‌ గా బహిరంగ కుట్రలు?

` ఇల్లు తగలబెట్టే కుయుక్తులు?

`తూర్పులో బిఆర్‌ఎస్‌ ను చిన్నా భిన్నం చేస్తున్నాడు?

`సారయ్య రాజీనామాకు బిఆర్‌ఎస్‌ నేతల డిమాండ్‌?

` ఆ పదవికి రాజీనామా చేసి నైతికత నిరూపించుకో…?

`అందరినీ కాదని అందలమెక్కిస్తే ఆగం చేసే కుటిల నీతి?

`బిఆర్‌ఎస్‌ ను కాదని బిజేపి లో చేరిన ప్రదీప్‌ రావుతో దోస్తీ?

`మాయ మాటలు చెప్పి ప్రదీప్‌ రావును బిఆర్‌ఎస్‌ కు దూరం చేస్తివి?

`ప్రదీప్‌ రావుకు రాజకీయం లేకుండా చేస్తివి?

`మాయ మాటలతో ప్రదీప్‌ రావును నిండా ముంచవడితివి?

` తూర్పు లో రాజకీయ అలజడి రేపుతుంటివి?

`మున్సిపల్‌ ఎన్నికలలో కావాల్సిన టిక్కెట్లు తీసుకుంటివి?

`బిఆర్‌ఎస్‌ ను ఓడిరచుమని ప్రచారం చేస్తివి?

` పచ్చగా వున్న పార్టీలో పచ్చగడ్డి వేసి రగిలిస్తుంటివి?

`నీ మీద సాలు..సాలు.. సారయ్యా…అని యువత పోస్ట్‌ లు పెడుతున్నా మారవైతివి?

`ఉద్యమ కారులకు ఎమ్మెల్సీ అందకుండా చేస్తివి?

`ఎందుకీ దొంగ రాజకీయం?

`తూర్పు లో తూ..తూ…అంటున్నరు?

`తిరకాసులు మానుకో…నీడనిచ్చిన పార్టీ రుణం తీర్చుకో!

`లేదంటే రాజీనామా చేసి తప్పు కో?

`ఇది సారయ్య గురించి జనం అనుకుంటున్న మాట!?

హైదరబాద్‌,నేటిధాత్రి: 

కొందరిలో కొన్ని అవలక్షణాలు మాత్రమే వుంటాయి. కాని కొందరిలో అన్నీ అవలక్షణాలే వుంటాయి. అయినా వారికి కాలం విపరీతంగా కలిసివస్తుంది. అప్పుడైనా తీరు మార్చకుంటారా? అంటే మారదు, తీరు మార్చుకోరు. మారితే వున్నవి పదవులు పోతాయనుకుంటారో లేక, వచ్చేవి రావనుకుంటారో? కాని ఏది చేసినా తామే రైట్‌ అనుకుంటారు. తాకులాటలు పెట్టిస్తుంటారు. రాజకీయ పబ్బం గడుపుకుంటుంటారు. సందిట్లో సడేమియాలాగా లాభపడుతుంటారు. ఎప్పుడూ నేనే వుండాలనుకుంటారు. కాలం కలిసిరానప్పుడు ఇతరులను ఎగదోసే రాజకీయాలు చేస్తుంటారు. మొసలి కన్నీరు కారుస్తూంటారు. అప్పుడే బడాయిలకు పోతుంటారు. అందలం ఎక్కించిన వారినే శంకిస్తుంటారు. వారికి నష్టం చేకూర్చే పనులు చేస్తుంటారు. కూర్చున్న కొమ్మనే నరికేయాలని చూస్తుంటారు. నమ్మిన వారిని నట్టెట ముంచేస్తుంటారు. ఇతరులను ఆగం చేయాలనే చూస్తుంటారు. అచ్చం అలాంటి క్యారెక్టరే వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో వుందని ప్రజలే చెప్పుకుంటున్నారు. అయినా ఆయనేమీ ఆశామాషీ లీడర్‌ కాదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా వున్నారు. అందుకే ఆయనను సాలు, సాలు…సారయ్యా? రాజకీయాలు మాకొద్దు సారయ్యా…అంటూ ఎత్తిపొడుస్తున్నారు. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆయనేమన్నారు? ఆయనేం చేస్తున్నారు. ప్రజలు ఎందుకు ఆయనను విమర్శిస్తున్నారు? అన్నది తెలుసుకుందాం! వరంగల్‌ రాజకీయాల్లో ఎమ్మెల్సీ సారయ్యది కూడా ఒక ప్రత్యేకమైన పాత్రే. కాకపోతే ఈ మధ్య ఆయన వ్యవహరశైలి వివాదమౌతోంది. తాను బిఆర్‌ఎస్‌లో చేరి పెద్ద తప్పు చేశానని అన్నారట. అది ఆనోట, ఈ నోట పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. గత పార్లమెంటు ఎన్నికల ముందు బిఆర్‌ఎస్‌లో చేరిన సారయ్యకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు. అదే ఆయనలో మరో రాజకీయ కోణాన్ని ఆవిష్కరించేందుకు దోహదపడుతోందని బిఆర్‌ఎస్‌ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పదవి ఇస్తే పార్టీ కోసం పనిచేస్తాడు. పార్టీ బలోపేతమయ్యేందుకు కృషి చేస్తాడని ముఖ్యమంత్రి కేసిఆర్‌ విశ్వసించారు. ఆయన బిఆర్‌ఎస్‌లో చేరిన నాడు పట్టుమని పది మంది కూడా ఆయన వెంట లేరు. పార్టీలో చేరలేదు. అయినా ఆయనపై ఎంతో నమ్మకం వుంచి ముఖ్యమంత్రి కేసిఆర్‌ పదవి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. సారయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని ఎవరూ అడ్డుకోలేదు సరికదా.. స్ధానిక నాయకులు ఆహ్వానించారు. ఆయన రాకను ఎవరూ అడ్డుకోలేదు. ఆయనకు పదవి ఇస్తామంటే కూడ ఎవరూ అడ్డు చెప్పలేదు. మాకు రాలేదని ఎవరూ బాధపడలేదు.

సారయ్య పార్టీలోకి రావడం వల్ల మాకు అన్యాయం జరిగిందని కూడా పార్టీలో ముఖ్యులు ఆందోళన చెందలేదు. పార్టీకి అదనపు బలం చేకూరితే చాలనే బిఆర్‌ఎస్‌ నేతలు అనుకున్నారు. కాని సారయ్య ఎమ్మెల్సీ అయిన తర్వాత తన రాజకీయం తాను చేయడం మొదలుపెట్టాడు. పార్టీలో అడుగడుగునా చిచ్చు పెట్టే పనులే చేస్తూ వస్తున్నాడు. ఇదీ బిఆర్‌ఎస్‌ నాయకులనుంచి పెద్దఎత్తున వినిపిస్తున్న వాదన. ఎప్పుడైతే బిఆర్‌ఎస్‌లో చేరి తప్పు చేశానిని ఎమ్మెల్సీ సారయ్య అన్నారో? అప్పుడే ఆయన తన విశ్వాసఘాతుకాన్ని వెలుగులోకి వచ్చినట్లైంది.

 అయినా ఆ పదవిలో వుండడానికి అర్హత లేదు. నైతికత అంతకన్నా కాదు. ఎంతో మంది నాయకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాన్ని సారయ్య గద్దలా తన్నుకుపోయాడు. అంతే కాదు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో నమ్మకంతో గవర్నర్‌ కోటాలో సారయ్యను ఎమ్మెల్సీ చేశారు. అంటే దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత సారయ్య వుండాలి. కాని అది విస్మరించాడు? అన్నది బిఆర్‌ఎస్‌ సాగుతున్న చర్చ. అదే సమయంలో వచ్చిన మున్సిపల్‌ఎన్నికల్లో తన అనుయాకులకు కావాల్సిన టిక్కెట్లు తీసుకున్నాడు. ఇతర డివిజన్లలో బిఆర్‌ఎస్‌ను ఓడిరచాలని ప్రచారం చేశాడు? అన్నది ఆ పార్టీ నాయకుల ప్రధాన వాదన. అయినా సారయ్య మాట ప్రజలు వినలేదు. వరంగల్‌ మొత్తం ప్రజలు బిఆర్‌ఎస్‌కు పట్టం కట్టింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద నమ్మకం, ఎమ్మెల్యేల మీద విశ్వాసం, స్ధానిక బిఆర్‌ఎస్‌ నాయకుల మీద గౌరవంతో ఊహించని మెజార్టీ ప్రజలిచ్చారు. అయినా సారయ్య తీరు మారలేదు. పార్టీని ఎలాగైనా ఇబ్బందులకు గురి చేయాలన్న కుట్రలు పన్నుతూనే వున్నారు? ఎప్పటికప్పుడు తూర్పు నియోజకవర్గంలో వర్గపోరు రగిలిస్తూనే వస్తున్నాడు? ఆయనతోపాటు, ఇతర నాయకులను ఎగదోసే రాజకీయాలు చేస్తూనే వున్నాడు? గత కొంత కాలంగా తూర్పులో అలజడి రాజకీయాలను ప్రోత్సహిస్తూ, పార్టీకే తీరని నష్టం చేకూర్చుతున్నాడు? ఇది పార్టీ నేతలు గమనించినా సమయం కోసం ఎదురుచూస్తున్నారు. 

 బిఆర్‌ఎస్‌ను బలహీన పర్చే క్రమంలోనే ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వీడేందుకు తెరవెనక కథ. స్క్రీన్‌ప్లే అంతా సారయ్యదే అన్నది ప్రచారం. 

ప్రదీప్‌ రావుకు పార్టీని వీడితే ఎంత లాభమో ఒక్కసారయ్యకు మాత్రమే తెలుసు. కాని ఆ విషయాన్ని ప్రదీప్‌రావు గుర్తించకుండా తొందపడ్డాడనేది చాలా మంది అభిప్రాయం. తూర్పులో వర్గ విభేదాలతో సతమౌతుంటే అదిష్టానం తనవైపు చూస్తుందనేది సారయ్య ఆలోచన. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు, సారయ్య ఏం చేస్తున్నాడనేది అంతా భహరంగ రహస్యమే అయినా ఆయన తన పాత పంథా వీడడం లేదు. కుయుక్తుల రాజకీయాలు మానడం లేదు. పైగా బిఆర్‌ఎస్‌లో చేరి తప్పు చేశారు. రాజకీయంగా నష్టపర్చుకున్నాను అనే వ్యాఖ్యలు చేయడం పెద్ద పొరపాటు. పదవిలో కొనసాగుతూనే అలాంటి వ్యాఖ్యలు ఆయన రాజకీయ జీవితానికి మరింత నష్టదాయకమే తప్ప, ఎలాంటి లాభం వుండదు. వాటిని సరిదిద్దుకునే అవకాశం అసలే వుండదు. ఇలా మాట్లాడుతూనే మరో వైపు తూర్పులో ఎవరెవరైతే ఆశవహులున్నారో వారందినీ టిక్కెట్టు కోసం ఎదగోసే రాజకీయం చేస్తున్నాడు. దాంతో ఇటీవల సారయ్య మీద ఓ సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున ఓ పోస్టు వైరల్‌ అవుతోంది. అందులో సారయ్య రాజకీయాన్ని తూర్పులో తూర్పార పట్టిన వైనం కనిపిస్తోంది.

సారయ్య హయాంలో రిక్షాలు కూడా నడవలేని రోడ్లు ఇప్పుడు అద్దాల్లా మెరుస్తున్నాయంటున్నారు. 

పాత కూరగాయల మర్కెట్‌ కంపు వదిలిందని గుర్తు చేస్తున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే సారయ్య చేసిందేమీ లేదంటున్నారు. పదవి అలంకారం చేసుకున్నాడంటున్నారు. నమ్మినోళ్లను నట్టెట ముంచడం, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మౌనంగా కూర్చోవడం, మంత్రిగా అవకాశం వచ్చినా ఒక్క పని చేసింది లేదని అంటున్నారు. అజంజాహీ మిల్లు అమ్ముకాన్ని అడ్డుకోలేదని చెబుతున్నారు. మాకొద్దు మీ పాత కంపు రాజకీయాలు అంటూ సోషల్‌ మీడియాలో సారయ్యకు వ్యతిరేకంగా పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. కోడలు,కొడుకు, తమ్ముడు..కుటుంబమంతా రాజకీయమే..! ఆస్ధులు కూడబెట్టుకోవడమే!! ఇంకా ఎందుకంత ఆశ…అంటూ నిలదీస్తున్నారు. ఇదీ సారయ్య ఎదుర్కొంటున్న ప్రజా వ్యతిరేకత. పచ్చగా వున్న తూర్పు రాజకీయాల్లో నిప్పులు పోయకంటున్నారు. ప్రతిపక్ష నేతలతో కలిసి చెట్టాపట్టాలేసుకొని, సొంత పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేయడం..పార్టీకి నష్టం చేయడం, సాలు..సాలు సారయ్యా! అని అంటున్నారు. తూర్పులో తూ..తూ..అంటున్నారని కూడా చెప్పుకుంటున్నారు. తిరకాసు రాజకీయాలు మానుకో అని హితవు పలుకుతున్నారు. నీడనిచ్చిన పార్టీ రుణం తీర్చుకో అని సూచిస్తున్నారు. లేదంటే రాజీనామా చేసి తప్పుకో అని అంటున్నారు. పార్టీ బలంగా వుండడాన్ని తట్టుకోలేకపోతున్నావా? నాకు ఎమ్మెల్యే టిక్కెట్టు రానప్పుడు పార్టీ ఎందుకు గెలవాలనుకుంటున్నావా? అని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. సారయ్య మోసాలు ఎండగడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *