వరంగల్‌ విజ(న్‌)య్‌…

`నవతరానికి వారథి- యువ తరం ప్రతినిధి. 

`ప్రజా సేవకు వారసుడు.

`అద్భుతమైన అవలోకనం…

`అనర్గళ వాక్చాతుర్యం..

`కేటిఆర్‌ స్పూర్తిగా రాజకీయం.

`రాజకీయాలు, సామాజిక సేవ రెండు కళ్లు.

`నా ఊపిరే సామాజిక సృహకు నిదర్శనం.

`పేద ప్రజలంటే ప్రాణం.

`అమ్మ బాటలోనే జనం కోసం.

`పేదల జీవితాలతో వెలుగుల కోసం..

`అసమానతలు తగ్గాలి…పేదలు బాగుపడాలి.

`ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి.

`సంక్షేమం అందరి దరి చేరాలి.

`పేదల కోసమేఈ జీవితం…

హైదరబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణ లో కొత్త తరం…యువతరంగాలు రాజకీయాలలోకి దూసుకొస్తున్నాయి…ఆదర్శ భావాలు నిండి, జనం కోసం తపించే తత్వం వున్న యువజనాయకులు ఎక్కువగా బిఆర్‌ఎస్‌ లో కనిపిస్తున్నారు. అటు ఉద్యమ సమయంలో పార్టీకి అంకితమై పని చేసిన వాళ్లు, నాయకుల వారసులంతా ఉత్తుంగ తరంగాలుగా బిఆర్‌ఎస్‌ లో మరో తరం నిర్మాణంలో కీలక భూమిక పోషించేందుకు సిద్ధపడుతున్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటు పడే నవతరం రాజకీయాలకు పురుడుపోస్తున్నారు. రేపటి తెలంగాణ కు దిక్సూచిలా మారనున్నారు. బిఆర్‌ఎస్‌ లో ఎక్కడ చూసినా యువతరం నాయకత్వమే తెరమీదకు వస్తోంది. తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెచ్చిన రాజకీయ సంస్కరణల్లో నవతరం రాజకీయాన్ని ప్రోత్సాహించడం గొప్ప విశేషం. ఎన్టీఆర్‌ తో వచ్చిన రాజకీయ విప్లవం మళ్ళీ కేసిఆర్‌ రూపంలో ఊపిరిపోసుకున్నది. తెలంగాణలో కొత్త తరం రాజకీయాల ఆవిష్కరణ జరిగింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో ప్రగతి పట్టాలెక్కి పరుగులు పెడుతోంది. నీటి జాడ లేని తెలంగాణలో జళ సవ్వడులు పరవళ్లు తొక్కుతున్నాయి. తెలంగాణ అవతరణ…ఆవిష్కరణ… బంగారు తెలంగాణ రూపకల్పన జరిగి, దేశంలోనే అభివృద్ధి విప్లవం తొనికిసలాడుతోంది. నెంబర్‌వన్‌ రాష్ట్రంగా విరాజిల్లుతోంది. అంతేకాకుండా యువతరానికి రాజకీయం అందించి, సామాజిక సేవలో, బాధ్యత లో ముందు వరుసలో నిలిపి పాలనలో కేసిఆర్‌ నూతన ఒరవడి సృష్టించారు. రేపటి తెలంగాణకు భవిష్యత్తు నవతర నాయకత్వాలను కూడా ప్రోత్సాహిస్తున్నారు. ఆ క్రమంలో వెలుగులోకి వచ్చిన యువతరం ప్రతినిధి, వరంగల్‌ ఆశ కిరణం గుండు విజయ్‌ రాజ్‌ ఒకరు. 

తాత తరంలో చేసిన పుణ్య కార్యాలు, తండ్రి ప్రభాకర్‌ సేవలు, నవతరంలో అమ్మ సుధారాణి నిర్వర్తిస్తున్న సామాజిక బాధ్యతలు ఓరుగల్లు వికాసానికి దోహదపడ్డాయి. వరంగల్‌ ప్రగతికి దారలు వెతికాయి. పేదలకు సాయాలు అందాయి. ఆ కుటుంబం చూపిన చొరవ, చూపిన దారితో ఎన్నో కుటుంబాలలో వెలుగులు నిండాయి. ఆ కుటుంబమే గుండు రాజశేఖరంది. తన హయాంలో చేసి, ఆచరించిన సేవా తత్పరత, ఆచరణలు, పుణ్య కార్యక్రమాలు ఇప్పటికీ వారసులు కొనసాగిస్తున్నారు. ఎన్నో ఆలయాల నిర్మాణాలకు ఇతోధిక ఆర్థికపరమైన సహకారం అందిస్తున్నారు. గుడికి వెళ్లే మార్గాలను తమ స్వంత ఖర్చులతో ఆధునీకరించారు. ఇలా అనేకం చేశారు. సాయం కోసం వచ్చిన వారిని ఆదరిస్తున్నారు. ఆదుకుంటున్నారు. ఇతోదిక సాయాలు అందిస్తున్నారు. ఆనాటి గుండు రాజశేఖరం తరం నుంచి పేదల పెళ్లిళ్లకు పుస్తె మట్టెలు అందజేస్తూ వస్తున్నారు. అలాంటి పుణ్య కార్యక్రమాలకు ఆనాడే శ్రీకారం చుట్టిన ఘనత గుండు కుటుంబానికిది. ఆ సంప్రదాయాన్ని ఇప్పటికీ ఆ కుటుంబం కొనసాగిస్తూనే వుంది. ఆనాటి నుంచి నేటికీ ఎన్నో గుప్త దానాలు చేస్తూనే వస్తున్నారు. పనుల కోసం వచ్చినా, సాయం కోసం వచ్చిన గడప లోకి వచ్చిన వారికి ఆకలి తీర్చి పంపేవారు. అందుకు వారి ఇంట్లో నిత్య సంతర్పణలు జరిగేవి. అందుకే గుండు కుటుంబం గురించి ఇప్పటికీ అంత గొప్పగా ప్రజలు చెప్పుకుంటారు. వరంగల్‌ కోసం గుండు రాజశేఖరం చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు వరంగల్‌ లో కనిపిస్తున్న వ్యాపారాభివృద్దికి ఆద్యుడు రాజశేఖరం. వరంగల్‌ ప్రతి విజయం వెనుక వున్న వ్యాపార ప్రపంచ నిర్మాణమే రాజశేఖరం సృష్టించిన సామ్రాజ్యం. అంతలా వరంగల్‌ అభివృద్ధిలో ఆయన పాత్ర వుంది. ఆయన కుమారుడైన గుండు ప్రభాకర్‌ తర్వాత తరంలో సేవా కార్యక్రమాల పరంపర కొనసాగిస్తూ వస్తున్నారు. రాజకీయాలను ప్రభావితం చేస్తూ వచ్చారు. అదే సమయంలో ప్రజలకు సేవ చేస్తూనే వరంగల్‌ అభివృద్ధిలో రాజకీయంగా భాగస్వామ్యమయ్యారు. ఆయన సతీమణి గుండు సుధారాణిని రాజకీయంగా ప్రోత్సాహించారు. బిసిలలో పద్మశాలి సామాజిక వర్గానికి మరింత వన్నె తెచ్చారు. అనేక ప్రజా సమస్యలు పరిష్కరించారు. రాజ్యసభ సభ్యురాలిగా గుండు సుధారాణి వరంగల్‌ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. మహిళ అయినా రాజకీయాలలో ఆమె నిర్వహించిన పాత్రకు గుర్తింపుగా తెలుగు దేశం పార్టీ రాజ్యసభ కు పంపించారు. రాజ్యసభ సభ్యురాలిగా తన పరిధిలో చేయాల్సిన అభివృద్ధి విసృతంగా వేసి, అందరి ప్రశంసలు అందుకున్నారు. వరంగల్‌ నగరం అభివృద్ధికి రాజ్యసభ సభ్యురాలిగా ఎంతో సహకరించారు. నిధులు తెచ్చి అభివృద్ధి చేశారు. వరంగల్‌ అభివృద్ధిలో అప్పుడే తనదైన ముద్రను వేశారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజనలో భాగంగా నీరుకుళ్ల గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించారు. రాజ్యసభలో తెలంగాణ కోసం గళమెత్తారు. తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీతో విభేదించారు. ఉద్యమానికి మద్దతు పలికారు. ఆ తర్వాత బిఆర్‌ఎస్‌ లో చేరారు. బిఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. వరంగల్‌ తొలి పౌరురాలిగా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. వరంగల్‌ ను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. అభివృద్ధిలో వరంగల్‌ ను పరుగులు పెట్టిస్తున్నారు. 

వారసుడే కాదు…రాజకీయ తరంగం…సేవా తోరణం…గుండు విజయ్‌ రాజ్‌. అటు వ్యాపారం, ఇటు రాజకీయం ఏక కాలంలో నిర్వహిస్తున్నారు. కుటుంబం కోసం వ్యాపారం, ప్రజల కోసం రాజకీయంలో రాణిస్తున్నారు. అందరి మన్ననలను అందుకున్నారు. ఈ తరం యువతలో రాజకీయాలపై అవగాహన తక్కువ. సామాజిక సేవ మీద లేదు మక్కువ..సామాజిక బాధ్యత మీద ఆలోచన అసలే తక్కువ… కానీ ఈ తరంలో ప్రజా సేవపై ప్రేమ..పేదల మీద మమకారం కలిగిన వారు భవిష్యత్తు తరం నిర్ణేతలు. అలాంటి వారిలో విజయలో పరిణతి చెందిన నాయకుడున్నాడు. సమాజం మీద మమకారం కలిగిన నాయకుడు. పేదలను అక్కున చేర్చుకునే మంచి తనం వున్న నాయకుడు విజయ్‌ రాజ్‌. సాయం కోసం వచ్చిన వారికి చేయూతనిచ్చే నాయకుడు. రాజకీయాలను పవిత్ర లక్ష్యంగా ఎంచుకున్న నాయకుడు విజయ్‌ రాజ్‌. నాయకులు అందరూ కావాలనుకుంటారు. కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోగలుగుతారు. అలాంటి రాజకీయాలలో విజయ్‌ రాజ్‌ తనదైన ముద్ర వేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. తరాలు మారినా తరగని అంతరాల మధ్య నలుగుతున్న పేదల జీవితాలతో వెలుగులు నిండాలి. వారిలో ముందు చైతన్యం నిండాలి. విద్య మరింత చేరువకాలాలి. మెరుగైన వైద్యం అందాలి. ఆరోగ్య వంతమైన సమాజం నిర్మాణం జరగాలి. ఆదర్శ వంతమైన సమసమాజ వికాసం కావాలి అని కోరుకుంటున్న యువ నాయకులలో విజయ్‌ రాజ్‌ ఒకరు. తెలంగాణ ఉద్యమం కోసం విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని, నేను సైతం అనుకొని తెలంగాణ పోరాటంలో మమేకమైన మంత్రి కేటిఆర్‌ స్పూర్తిగా రాజకీయాలలో రాణించాలని విజయ్‌ రాజ్‌ ముందుకు సాగుతున్నారు. మంత్రి కేటిఆర్‌ లో వున్న కొన్ని అరుదైన లక్షణాలు గుండు విజయ్‌ రాజ్‌ లో వున్నాయి. సమకాలీన ప్రపంచాన్ని చదివే అర్థిక, సామాజిక వేత్తలకు ఎంత అవగాహన వుంటుందో అంతటి మేధాశక్తి విజయ్‌ రాజ్‌ లో కనిపిస్తుంది. గుప్త దానాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, మానవత్వం తో కూడా మంచి పనులే కాదు, సమాజం మీద విసృతమైన అవగాహన కలిగిన నాయకుడు విజయ్‌. నిజానికి ఈ తరం రాజకీయ నాయకులకు అంతటి సామాజిక సృహ తక్కువ. రాజకీయాలు తప్ప సమాజాన్ని చదువుతున్న వారు లేరు. పెరిగిన పోటీ తత్వం మూలంగా రాజకీయాలలో సామాజిక బాధ్యతను కొందరు నాయకులు నిర్వర్తించలేకపోతున్నారు. కానీ విజయ్‌ లాంటి వారిలో ఎన్నో గొప్ప ఆలోచనలు వున్నాయి. తల్లిదండ్రులు ఆశయాలు పునికి పుచ్చుకొని, మంత్రి కేటిఆర్‌ స్పూర్తి ఆదర్శంగా తీసుకొని రాజకీయాల మీద పూర్తి అవగాహన సొంతం చేసుకున్న నాయకుడు విజయ్‌. మంత్రి కేటిఆర్‌ ఎలా అయితే సమస్యల మీద అనర్గళంగా, అలవోకగా పూర్తి అవగాహనతో, తడబాటు లేని వివరణలు ఎలా ఇస్తారో నిత్యం మనం చూస్తూనే వున్నాం. అలాగే సమస్యల మీద అంత అద్భుతంగా, అర్థవంతమైన వివరణ ఇవ్వడంలో విజయ్‌ రాజ్‌ కూడా ఎంతో ప్రావీణ్యం వున్న నాయకుడు. సమస్యల మీద అవగాహన, అలవోకగా చర్చించడం, వివరించడంలో తనదైన శైలిని విజయ్‌ ప్రదర్శిస్తున్నారు. రాజకీయ నాయకులకు కావాల్సిన మూడు ముఖ్య లక్షణాలు విజయ్‌ లో మెండుగా వున్నాయి. విజయ్‌ కు ప్రజలు చెప్పే సమస్యలు విసుగు లేకుండా వినడం తెలుసు. వచ్చిన వారు చెప్పే ప్రతి విషయాన్ని ఎంతో ఓపికగా వింటారు. దానిపై విసృతంగా చర్చిస్తారు. సాధ్యా సాధ్యాలపై అప్పటికప్పుడు సూచనలు, సలహాలు తీసుకుంటారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఈ మూడు లక్షణాలు వున్న ఏ నాయకుడు రాజకీయాలలో వెనుతిరిగి చూడలేదు. విజయ్‌ లో కూడా అలాంటి నాయకత్వం మెండుగా వుంది. చిన్నతనం నుంచే రాజకీయాలు చూస్తూ పెరిగినా పెత్తనం అలవర్చుకోలేదు. ప్రజలను ప్రేమించడం నేర్చుకున్నాడు. చిరునవ్వుతో పలకరించడం నేర్చుకున్నాడు. వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకోవడం చిన్న నాటి నుంచే అలవర్చుకున్నారు. తాత తరం సేవలు…తండ్రి తరం ఆచరణలు..అమ్మ సుధారాణి ఆశయాలను నేటి తరం యువ నాయకుడుగా గుండు విజయ్‌ రాజ్‌ కొనసాగిస్తున్నారు. రాజకీయాలలో తనదైన పాత్ర పోషిస్తున్నారు. అలాంటి విజయ్‌ రాజుకు నేటిధాత్రి దినపత్రిక పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తోంది. విజయ్‌ రాజ్‌ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు నిండు నూరేళ్లు జరుపుకుంటూ, జీవితాంతం ప్రజలకు సేవ చేయాలని నేటిధాత్రి కోరుకుంటోంది. అభినందనలు, శుభాకాంక్షలు అందిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *