ప్రభుత్వ లాంఛనాలతో రాకేష్ అంత్యక్రియలు.

అంతిమయాత్ర బాధ్యతలు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ను పర్యవేక్షించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు

హైదరాబాద్ నేటిధాత్రి

శుక్రవారం రైల్వే పోలీసుల కాల్పుల్లో మరణించిన , వరంగల్ జిల్లా కు చెందిన రాకేష్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.

అగ్నిపథ్ నియామకాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలో రాకేష్ మరణించడం దురదృష్టకరమని  ముఖ్యమంత్రి కేసిఆర్ విచారం వ్యక్తం చేశారు.

కేంద్రం యువకుల జీవితాలతో ఆడుకోవడం దురదృష్డకరమన్నారు. *రాకేష్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేసిఆర్ ఒక ప్రకటించారు. రాకేష్ కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారంతో పాటు, ఆ

కుటుంబంలో అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం అందించనున్నారు.* రాకేష్ అంత్యక్రియల బాధ్యతలను *వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కు అప్పగించారు.* ఎప్పటికప్పుడు అన్ని విషయాలు దగ్గరుండి పర్యవేక్షించాలని *ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్ నరేందర్ కు సూచించారు.* శనివారం రాకేష్ అంతిమయాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ పోలీసు అధికారులను ఆదేశించారు.*ఈ అంతిమ యాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు కాబట్టి* ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వుండాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *