దానం దాగుడు మూతలు?

`పైకి ఒక ప్రచారం… లోన మరో నాటకం?

`కార్యకర్తలతో బిఆర్‌ఎస్‌ పై తిట్ల దండకం?

`బిఆర్‌ఎస్‌ ముఖ్యులపై బూతు పురాణం?

`ఇలాంటి పార్టీ ఎక్కడా వుండదంటూ చీత్కారం?

`బైటికొచ్చి టిక్కెట్‌ నాదేనంటూ వింత ప్రచారం?

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ మనసులో నేనే వున్నానంటూ ప్రకటన పర్వం.

`తనకు తానే స్వయం ప్రకటిత నాయకత్వం?

`పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడటం?

`ఆ మధ్య హోం మంత్రి ని వివాదంలో కి లాగిన వైనం?

`తాజాగా మంత్రి తలసాని, ఆయన కుమారుడి మద్దతు కోసం ఆరాటం?

`ఎప్పటికప్పుడు అవకాశవాద రాజకీయం?

` కప్పదాటుడు అలవాటు చేసుకున్న వైనం?

`ఆది నుంచి అదే ప్రయాణం?

` పదవికోసమే ఎల్లప్పుడూ ఆరాటం?

` ముందు కాంగ్రెస్‌, తర్వాత టిడిపి…మళ్ళీ కాంగ్రెస్‌… ఇప్పుడు బిఆర్‌ఎస్‌.. రేపు?

`సేవాదళ్‌ నుంచి ఎదిగినా కాంగ్రెస్‌ కు చేసిందేమీ లేదు?

`చంద్రబాబు అర్థరాత్రి టిక్కెట్‌ ఇచ్చినా నీతి నిలుపుకోలేదు?

`ఉద్యమ కారులను కాదని కారెక్కించుకున్నా నిబద్ధత లేదు?

`తెలంగాణ కోసం కొట్లాడిరది లేదు?

`ఉద్యమానికి సాయపడ్డది లేదు?

`ఉద్యమకారులను ఉరికించిండు?

`లాఠీ పట్టుకొని తరిమిండు?

`చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని తెలంగాణ వద్దన్నడు?

`ఇప్పుడు సుద్దులు చెబుతున్నడు?

`టిక్కెట్‌ రాకపోతే జంప్‌ అయ్యేందుకు సిద్దంగా వున్నడు?

`టిక్కెట్‌ రాదని తెలిసి, బిఆర్‌ఎస్‌ నే తిడుతున్నడు?

`నిన్నటి దాక తలసానితో కయ్యం?

`టిక్కెట్‌ రాదనగానే నెయ్యం?

`ఆఖరు మోకా…టిక్కెట్‌ రాకుంటే పోతా?

హైదరబాద్‌,నేటిధాత్రి: 

 అయిన వాడు కాకపోకపోయినా అక్కున చేర్చుకున్నాడు. కాని వాడు కాకపోయినా కారెక్కించుకున్నారు. ఉద్యమంలో లేకపోయినా అందలమెక్కించారు. అడిగిన వెంటనే పార్టీ టిక్కెట్టు కూడా ఇచ్చారు. గెలిపించారు. అందరినీ పక్కనపెట్టి ప్రాధాన్యతనిచ్చి ప్రాధాన్యతనిచ్చారు. చరిత్రేమిటో తెలిసినా కడుపులో పెట్టుకున్నారు. గతంలో ఎన్ని తిట్టినా మర్చిపోయారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాడని అనుకున్నారు. కాని ఆయన తీరు మారలేదు. ఆయన వ్యవహార శైలి మారలేదు. ఆయన పక్క చూపులు వీడలేదు. కార్యకర్తలకు సేవ చేయలేదు. పదవి ఇచ్చినందుకు ప్రజలకు సేవ చేయలేదు. అన్ని సమకూర్చినా పార్టీకి మేలు చేయలేదు. పార్టీ బలపడేందుకు కృషి చేయలేదు. పార్టీ శ్రేణులను కాపాడుకోవాలన్న కనీస ధర్మం ప్రదర్శించలేదు. ఇదంతా ఎవరి గురించో అనుకుంటున్నారా? ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ గురించి? ఎవరు అనుకుంటున్నారని అనుకుంటున్నారా? సాక్ష్యాత్తు ఆయ కోసం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, గెలిపించుకున్న శ్రేణులు అంటున్న మాటలు. దానం నిజ స్వరూపం గురించి చెప్పుకుంటున్న మాటలు. పార్టీ ఇచ్చిన ఆదేశాలకు లోబడి, కట్టుబడి ఉద్యమ కారుడు కాకపోయినా, పార్టీకి సేవ చేసిన నాయకుడు కాకపోయినా, తెలంగాణ కోసం కొట్లాడకపోయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో పెద్ద మనసుతో అక్కున చేర్చుకున్నారు. పార్టీలో తగిన గుర్తింపునిచ్చారు. కాని దానం దాన్ని నిలుపుకోలేదన్నది పార్టీ శ్రేణుల ప్రదాన వాదన. ఎందుకంటే నాయకుడంటేనే నటించడంతో ఆరి తేరిన వారు అని నానుడి. అబద్దాలు చెప్పడంలో దిట్టలు. వాళ్లు అవునంటే కాదని, కాదంటే అవునన్న సంకేతాలన్నది జగమెరిగిన సత్యమే. అయినా అలాంటి వారినే జనం నమ్ముతారు. అంతెందుకు ఎవరైనా నమ్ముతారు. అలా ఆ నాయకులు నమ్మిస్తారు. 

   ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఇప్పుడిప్పుడే మళ్లీ తన స్వార్ధ రాజకీయాలకు పదును పెడుతున్నారని సమాచారం. 

అయితే టిక్కెట్టు ఇస్తే, ఇక్కడ లేకుంటే మరో చోట అన్న ఆలోచనతోనే దానం నాగేందర్‌ వున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఇటీవల పార్టీ శ్రేణులైన కొంత మంది ఆంతరంగికులతో చెబుతున్న మాటలు వింటే దానం దాగుడు మూతలు మొదలుపెట్టారని తెలుస్తోంది. దానం నాగేందర్‌ పైకి చెప్పే మాటలకు, ఆచరిరంచే చేతలకు చాలా తేడా వుంటుందని అంటుంటారు. అందుకే పైకి తాను బిఆర్‌ఎస్‌ నుంచే పోటీ చేస్తానని చెబుతూనే లోన మాత్రం బిఆర్‌ఎన్‌ను నాయకుల ముందే పార్టీని తిడుతున్నాడని కొందరంటున్న మాట. ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ను, మంత్రి కేటిఆర్‌లపై కూడా విరుచుకుపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అసలు బిఆర్‌ఎస్‌ ఒకపార్టీయేనా అంటూ కూడా దానం నాగేందర్‌ విమర్శిస్తున్నట్లు చెబుతున్నారు. ఇవి ఇలా వుంటే ఆయన తన రాజకీయ ఎత్తుగడలకు కూడ ఎంతో చాకచక్యంగా వేస్తున్నాడని అంటున్నారు. మొన్నటి దాక తనకే టిక్కెట్టు వస్తుందన్న నమ్మకం వున్నంత కాలం వచ్చే ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను ఓడిరచాలన్న పక్కా ప్లాన్‌ ప్రిపేర్‌ చేసుకున్నాడట. అందుకు అవసరమైన గ్రౌండ్‌ వర్కు కూడా చేపట్టారట. ఎందుకంటే గ్రేటర్‌ హైదరాబాద్‌లో బలమైన నాయకుడిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ వున్నారు. ఆయన తర్వాత మాజీ మంత్రిగా తనకే గుర్తింపు వుంటుందనుకున్నాడు. కాని దానం నాగేందర్‌కు ఈసారి టిక్కెట్టు రాకపోవచ్చన్న వార్త ప్రచారంలోకి రావడంతో ఏం చేయాలో తోచడం లేదట. ఇది మింగుడు పడని వార్త కావడంతో ఎలాగైనా తలసానిని మచ్చిగ చేసుకోవాలన్న కొత్త ఎత్తులు వేస్తున్నాడట. ఇటీవల జరిగిన నియోజకవర్గ స్ధాయి ప్లీనరీ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ను, ఆయన కుమారుడుని దానం నాగేందర్‌ ఆహ్వానించి, తనకు అనుకూలమైన ప్రకనలు చేయించుకున్నాడు. కాకపోతే పార్టీ వేదిక మీద ఎంత వరకు చెప్పాలో మంత్రి తలసాని అంతే చెప్పడం జరిగింది. కాని దాన్ని దానం వక్రీకరించి, వచ్చే ఎన్నికల్లో దానం నాగేందర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పినట్లు దానం ప్రచారం చేసుకుంటున్నాడు. అంతే కాకుండా గతంలో రంజాన్‌ మాసంలో హోం మంత్రి మహమూద్‌ అలీని ఇఫ్తార్‌ పార్టీకి ఆహ్వానించి దాన్ని కూడా రాజకీయంగా వినియోగించుకున్నాడు. ఆ సందర్భంలో మంత్రి మహమూద్‌ అలీ చెప్పిన విషయాలను వక్రీకరించి, దానంను గెలిపించుకోవాలని హోం మంత్రి చెప్పినట్లు ప్రచారం చేసుకున్నాడు. ఇవి అవాస్తవాలు అని ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో విసృతంగా ప్రచారం జరుగుతుండడంతోపాటు, ఈసారి దానంకు టిక్కెట్టు కట్‌ అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తలు దానం పని అయిపోయిందన్న ప్రచారం చేస్తున్నారు. దాంతో తాజాగా ఖైరతాబాద్‌ టిక్కెట్టు తనకే అంటూ దానం స్వయం ప్రచారం చేసుకుంటున్నారు. వచ్చిపోతున్న వారికి పిలిచి మరీ చెప్పుకుంటున్నాడట. కాకపోతే దానం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నాడు. బిఆర్‌ఎస్‌లో ఎవరికి టిక్కెట్టు అన్నది ముఖ్యమంత్రి కేసిఆర్‌, మంత్రి కేటిఆర్‌ కు తప్ప ఎవరూ ప్రకటించే హక్కు లేదు. పైగా ఎమ్మెల్యేలే స్వయం ప్రకటిత అభ్యర్ధులు కావడం కూడా పార్టీ వ్యతిరేక చర్యలకు నిదర్శం. 

 ఇక దానం నాగేందర్‌ ఆనాడు ఉద్యమానికి సహకరించింది లేదు.

 తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఏనాడు పలికింది లేదు. బిఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత పార్టీకి అంకితమై పనిచేసింది లేదు. ఎందుకంటే ఇటీవల లిక్కర్‌ కేసు పేరుతో ఈడీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇబ్బందులకు గురి చేసింది తెలిసిందే. ఆ సమయంలో ఈడీ కల్వకుంట్ల కవిత ఇంటికి రాకుండా అడ్డుపడి, ఒక వేళ కవితను అరెస్టు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించింది ఉద్యమకారులు. అందులో ప్రధాన పాత్ర పోషించిన నాయకుడు మన్నె గోవర్ధన్‌రెడ్డి. అంతే కాదు ఆయనను ఈ విషయంలో పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఒకరోజు మొత్తం పోలీస్‌స్టేషన్‌లోనే వున్నారు. అరెస్టు చేయబడ్డాడు. . అసలు డిల్లీ లిక్కర్‌ అనేది కేసే కాదు..అంటూ వాదించిన వారిలో మన్నె గోవర్ధన్‌ రెడ్డ ముందున్నారు. కాని దానం నాగేందర్‌ ఏనాడు దీనిపై స్పందించలేదు. కవితపై వస్తున్న ఆరోపణలను ఖండిరచలేదు. సాక్ష్యాత్తు ఇటీవల డిల్లీ హైకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అంటే పార్టీ నాయకురాలికి కూడా అండగా వుండేందుకు ముందుకు రాని ఎమ్మెల్యే దానం ఇక ప్రజలకు ఏం సేవ చేస్తాడు? వారికి ఏలా అండగా వుంటాడన్నది ఖైరతాబాద్‌లో పెద్దఎత్తున చర్చ సాగుతోంది. అంతే కాదు డిల్లీలో బిఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభించిన నాడు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రుల హజరయ్యారు. కాని వ్యక్తిగత పనుల పేరుతో హజరు కాని ఏకైక నాయకుడు దానం నాగేందర్‌? అలాంటి నేతను ఇంకా పార్టీ నెత్తిన పెట్టుకోవడం పార్టీ శ్రేణులకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే దానంకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు వ్యతిరేకతను చూపిస్తూనే వున్నాయి. ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు అండగా వుండాల్సిందిపోయి, పెద్దఎత్తున భూమలు కబ్జాకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గతంలో జూబ్లీహిల్స్‌లోనూ, ఇప్పుడు బేగంపేట ఏరియాలోనూ పేదలను తరిమేసి, మరీ భూమలు ఆక్రమించుకుంటున్నాడన్న విమర్శలున్నాయి. ఒకనాడు కాంగ్రెస్‌లో సేవా దళ్‌ కార్యకర్తగా కింది స్ధాయినుంచి ఎదిగిన దానం నాగేందర్‌ ఇప్పుడు ఆ రోజులు మర్చిపోయారు. ఎమ్మెల్యేగా పార్టీ కార్యకర్తలంటే లెక్కలేని తనాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకే ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఈసారి దానంను ప్రజలే కాదు కార్యకర్తలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన నాయకత్వాన్ని తమపై రుద్దొద్దని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *