*ఉద్దేశపూర్వకంగానే కేంద్రం ఈడీ దాడులు చేస్తుంది* *ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్*

అమిత్ షా చెప్పులు మోస్తూ కేంద్రంతో కుమ్మక్కై మున్నూరుకాపు బీసీ బిడ్డలపై కుట్రపన్నుతున్న బండి సంజయ్..

మున్నూరు కాపు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న బండి సంజయ్ ని రాజకీయంగా బొందపెడతాం..

మున్నూరు కాపు నేతలపై ఈడీ దాడులను

ఖిండిస్తున్నాం..ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఈడీ దాడులు చేస్తుంది..

ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..

మున్నూరుకాపు బీసీ నేతలు మంత్రి గంగుల కమాలాకర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ రవిచంద్ర లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం

ఉద్దేశపూర్వకంగా ఈడీ దాడులు చేపిస్తుందని నిరసనగా వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆద్వర్యంలో మున్నూరుకాపు బీసీ నేతలు,ముఖ్యనాయకులు నిరసన తెలిపారు.కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మను తగులబెట్టారు..

 

కేంద్రప్రభుత్వం తో కుమ్మక్కై అమిత్ షా చెప్పులు మోసి బానిసత్వానికి అలవాటు పడ్డ బండి సంజయ్ మున్నూరుకాపు బీసీ నేతలపై పిర్యాదులు చేస్తూ మోదీ ప్రభుత్వంతో కలిసి ఉద్దేశపూర్వకంగా మున్నూరుకాపు బీసీ నేతలపై ఈడీ దాడులు చేపడుతుందని,గౌరవంగా బ్రతికే మున్నూరుకాపు బిడ్డల గౌరవానికి భంగం కలిగిస్తుందన్నారు..బండి సంజయ్ బానిసత్వంతో మున్నూరు కాపు బీసిలను అవమానిస్తున్నాడన్నారు..బీసీలంతా కలిసి బండి సంజయ్ ని రాజకీయంగా బొందపెడతారన్నారు..

మున్నూరు కాపు బీసీలను అగౌరవపరిచిన బీజేపికి తప్పకుండా బుద్దిచెబుతామన్నారు..మున్నూరు కాపు బీసీ బిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వివిద హోదాల్లో గొప్ప అవకాశాలు కల్పించారన్నారు..మున్నూరు కాపు బీసి బిడ్డలు ప్రజాసేవలో ఉన్న గంగుల కమలాకర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ రవిచంద్ర ల ఇండ్లపై కేంద్రప్రభుత్వం ప్రోద్బలంతో ఈడీ దాడులు నిర్వహిస్తుందన్నారు..బీజేపీ జేబు సంస్థగా ఈడీ వ్యవహరిస్తుందన్నారు..

 

ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు, మున్నూరు కాపు బీసీ నేతలు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *