BRS Leader Arrest Triggers Tension
జహీరాబాద్ మండల బి. ఆర్. ఎస్ పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ అక్రమ అరెస్ట్
జహీరాబాద్ నేటి ధాత్రి:
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులకు సంబంధించి అసెంబ్లీని ముట్టడించేందుకు తరలివస్తున్న జహీరాబాద్ మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, మాజీ సర్పంచులు చందర్ చౌహాన్, చిన్నారెడ్డి, కరుణ్ రాజ్‌లను ఈ ఉదయం వారి ఇళ్ల వద్ద అరెస్టు చేసి జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా తట్టు నారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయిందని, పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించకుండా అక్రమ అరెస్టులు చేస్తూ ఇంకెంతకాలం కాలయాపన చేస్తారని ప్రశ్నించారు. అప్పు చేసిన డబ్బుతో గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి మూడేళ్లయిందని, బిల్లులు చెల్లించకుండా పోలీసులను, అధికారులను ఉపయోగించి పాలించడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి గుణపాఠం నేర్పిస్తారని ఆయన హెచ్చరించారు మరియు మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
