జైపూర్, నేటి ధాత్రి:
ఇవాళ ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం
ప్రతి ఏడాది జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈరోజే వేసవి సెలవులు తర్వాత స్కూల్స్ ప్రారంభమవుతాయి. చిన్నారులను పనిలో చేర్చడానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ఉద్యమానికి ఉత్ప్రేరకంగా పనిచేయడమే దీని లక్ష్యం.