రాధక్క త్యాగం మరువలేనిది

నర్సంపేట,నేటిధాత్రి :

గోదావరిలోయ ప్రతిఘటన ఉద్యమ నిర్మాత చంద్ర పుల్లారెడ్డి బార్య రాధక్క త్యాగం మరువలేనిదని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఎలకంటి రాజేందర్ అన్నారు. రాధక్క (86) అనారోగ్యంతో హైదరాబాదులో మరణించారు.సుమారు 60 సంవత్సరాలుగా విప్లవ ఉద్యమాలలో ఎన్నో కీలకమైన బాధ్యతలను ఆమె నిర్వహించారు.గోదావరిలో ప్రతిఘటన పోరాట ప్రాంతంలో ప్రజలతో కలిసి ఉద్యమాలు నిర్వహించారని రాజేందర్ తెలిపారు.ఈ సందర్భంగా నర్సంపేటలోని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో
రాధక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఏఐకెఎం డివిజన్ కార్యదర్శి జక్కుల తిరుపతి, భోగి సారంగపాణి, పిడిఎస్ యు డివిజన్ కార్యదర్శి గుర్రం అజయ్,పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి పూలక్క, పివిఎల్ నాయకులు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *