మేడిగడ్డలో జియో టెక్నాలజీ ప్రారంభం ఎప్పుడు.!

వర్షాకాలం ప్రారంభవానికి 10 రోజులు, జియో ట్యూబ్ అమర్చడం సాధ్యమేనా.?

సమయానికి జియో ట్యూబ్ అమర్చడంలో ఆలస్యం అయితే, మేడిగడ్డ పరిస్థితి ఏమిటి.

రెండువేల క్యూసెక్ నీటిని తట్టుకునే పరిస్థితి లేదు, 20 లక్షల క్యూసి నీటిని మెడిగడ్డ ఏలా నిలువ చేస్తుంది.

మెడిగడ్డ లో గ్రౌండింగ్ పనులు,

ఏడవ బ్లాక్ పనులు కొనసాగింపుకు ,ఫస్ట్ బ్లాక్ కు నీటిని మళ్లింపు.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

కాలేశ్వరం ప్రాజెక్ట్ ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డ గత సంవత్సరం అక్టోబర్ నెలలో కుంగిపోవడంతో ఏడవ బ్లాక్ గేట్ల నుండి నీటిని ఎగువకు వదిలే పరిస్థితి లేకపోవడం, మూడు గోదావరి లా నీటిని నిలువ చేసి రాష్ట్రవ్యాప్తంగా  కోట్ల ఎకరాలకి నీరు అందించాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ మూడు సంవత్సరాలకే కుంగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనాన్ని లేపింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పరిస్థితిపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలించిన తరువాత ఇప్పుడు బ్యారేజ్ సంపూర్ణంగా వినియోగంలోకి వస్తుందా లేక 8 గేట్లను తొలగించి వదిలి పెడతారా, జియో టెక్నాలజీని ఉపయోగించి వర్షా కాలం ప్రారంభానికి ముందు జియో ట్యూబులను అమర్చి నీటిని మళ్లించే కార్యక్రమం ఎప్పుడు చేపడతారు, ఇప్పటికే జియో టెక్నాలజీ పై ఇరిగేషన్ శాఖ ఖచ్చితంగా జియో ట్యూబ్ తోనే బ్యారేజ్ మరమ్మత్తు సాగడం ఏకైక మార్గం, మరో దారి కూడా లేదు, కానీ గత కొన్ని రోజులుగా జియో టెక్నాలజీ మేడిగడ్డకు ఒకే ఒక్క మార్గం అని పనులు ప్రారంభించాల్సిందే అన్నారు. కానీ బ్యారేజ్ వద్ద జియో టెక్నాలజీ పనులు మాత్రం ఎక్కడ కనబడడం లేదు.

మేడిగడ్డ బ్యారేజ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధ్యాయం చేసిన అనంతరం సంచలన వాక్యాలను తెరపైకి రావడం జరిగింది. ఏడవ బ్లాక్ తో పాటు ఎనిమిదవ బ్లాక్ పరిస్థితి కూడా ప్రమాద సంకేతాల్లోని ఉంది. కానీ ప్రస్తుతం మేడిగడ్డ పునర్నిర్మాణ పనులకు జియో టెక్నాలజీ ద్వారా జియో ట్యూబులు ఏకైక మార్గమని ఎన్ డి ఎస్ ఏ కూడా తేల్చి చెప్పింది. ప్రస్తుత మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి, రోజు కుక్క పిల్లర్ వ్యవహారం బయటపడడం జరుగుతుంది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టి ఇరిగేషన్ శాఖ, మేడిగడ్డ బ్యారేజ్ పూర్తిస్థాయి నిర్మాణ పనులకు సంబంధించి ఏలాంటి ప్రణాళిక రూపొందించకపోవడం కూడా ఒక కారణం. లక్ష కోట్ల బ్యారేజ్ కేవలం పది రోజులు వర్షాకాలం ప్రారంభవానికి ఉండడం. ప్రస్తుతం ఏడవ బ్లాక్ ల వద్ద పిల్లర్ల పనులను కొనసాగించడం, కౌంటింగ్ తో కెమికల్ ను పిల్లర్ల లోపటికి పంపడం లాంటి పనులను కొనసాగిస్తున్నారు. ఏడవ బ్లాక్ నిర్మాణ పనులు సాఫీగా కొనసాగడం వర్షాకాలం సీజన్ లో సాధ్య పడుతుందా, జియో ట్యూబులను అమర్చడంలో ఎల్ఎన్ టి ఇరిగేషన్ శాఖ సఫలీకృతులు అవుతారా అనే విషయం ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది.

7 ,8 వ బ్లాక్ పునర్నిర్మాణ పనులు, వర్షా కాలానికి ముందు ప్రారంభించకుంటే మెడిగడ్డ పరిస్థితి ఏమిటి,? అని అనుమానాలు రాక తప్పడం లేదు. మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్ల తో 16 టీఎంసీల నీటిని నిలువ, ఎగువకు నీటిని వదిలే సామర్థ్యంతో నిర్మాణం చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఏడూ ఎనిమిదవ బ్లాక్ ల నుండి. 50 మీటర్ల దూరం లో ఉన్న నీటిని మళ్లించుటకు కాపర్ డ్యాం ఏర్పాటు చేయడం జరుగుతుంది, 2000 క్యూసి మీరు ప్రస్తుతం బ్యారేజ్లో ఉన్నప్పటికీ వాటి ప్రవాహాన్ని తట్టుకునే పరిస్థితి లేదు, 16, 17 ,21, 22 పిల్లర్ల వద్ద వస్తున్న నీటి ఊటను 40 హెచ్ పి మోటర్లు అమర్చి ఎత్తిపోస్తున్న, ఊట ప్రభావం ఆపడం సాధ్యం కావడం లేదు. గత సంవత్సరం మేడిగడ్డ బ్యారేజీ లో వర్షాకాలంలో భారీ వరదల వల్ల సుమారు 20 లక్షల క్యూసెక్ నీరు నిలువ ఉంది. మేడిగడ్డ తో పాటు అన్నారం బ్యారేజీ ల వద్ద సామర్థ్యానికి అతి సమీపంలో 99 శాతం బ్యారేజ్ ఎత్తు వరకు గత సంవత్సరం నీరు రావడం జరిగింది. ఈ క్రమంలో ఏడు ఎనిమిది బ్లాక్ ల పరిస్థితి ఏమవుతుంది. అనేది ఆలోచించాల్సిన విషయం.

మేడిగడ్డ బ్యారేజ్ పునర్ నిర్మాణం పనులు వర్షా కాలానికి ముందు పూర్తయ్యే పరిస్థితి మాత్రం కనబడడం లేదు. ఒకవేళ వర్షాల ప్రభావం గోదావరి వరద నీరు పెద్ద మొత్తంలో వచ్చి ఇంచుమించు 20 లక్షల క్యూబిక్ నీరు మేడిగడ్డ బ్యారేజ్ లో ప్రవహిస్తే 7 8 బ్లాక్ లతో పాటు మేడిగడ్డ పరిస్థితి ఏమిటి, ఇప్పటికే జియో టెక్నాలజీ పనులు ప్రారంభించవలసి ఉండాల్సి నప్పటికి నిర్మాణ సంస్థ ఇరిగేషన్, మేడిగడ్డ పునర్నిర్మాణ పనులపై స్పష్టత ఎందుకు రావడం లేదు, ఏడవ బ్లాక్ చెడిపోయింది, ఎనిమిదవ బ్లాక్ పరిస్థితి ఎంతవరకు సజావుగా ఉంది, రెండు బ్లాక్ లకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అన్న వాటిపై క్లారిటీ లేదు, అసలు మేడిగడ్డ ప్రాజెక్ట్ డిజైన్ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో చేపట్టడం జరిగిందా.! అనేది సందిగ్ధంలో కనబడుతుంది. లక్ష కోట్ల రూపాయలను వెచ్చించి నిర్మించిన భారీ ప్రాజెక్ట్ సమయానికి ముందే కుంగిపోవడం పెద్ద మొత్తంలో పిల్లర్లు దెబ్బతినడం, జరిగినప్పటికీ వాటికి తక్షణ పునర్నిర్మాణ పనుల విషయంలో ఇంజనీరింగ్ మరియు ఇరిగేషన్ విభాగం వద్దా ప్రణాళిక లేకపోవడం అనేక ప్రశ్నలకు దారితీస్తుంది.

ప్రస్తుతం మేడిగడ్డ సంరక్షణ కొరకు గ్రౌంటింగ్ పనులు అవసరమా లేక జియో టెక్నాలజీ అవసరమా అనే విషయానికొస్తే, 15,16,పిల్లర్ల వద్ద ప్రస్తుతం కొనసాగిస్తున్న కౌంటింగ్ పనులు చేపట్టడం జరుగుతుంది అలాగే 18వ పిల్లర్ వద్ద కెమికల్ కౌంటింగ్ ను చేయడం జరుగుతుంది. అలాగే 12 13వ పిల్లర్ల వద్ద నుండి గ్రౌండ్టింగ్ టెస్ట్ కొరకు మట్టిని ల్యాబ్ కు తరలించినట్టు కూడా తెలుస్తుంది. కానీ ప్రస్తుతం చేపడుతున్న పనులు ఒక వైపైతే వర్షాకాలంలో పనులు చేపట్టే పరిస్థితి ఉండదని ఎల్ అండ్ టి మరియు ఇరిగేషన్ అధికారులు కాస్త వేగం కూడా పెంచినట్లు తెలుస్తోంది, కానీ గ్రౌండ్ టింగ్ కన్నా, ముఖ్యం జియో టెక్నాలజీ పనులు ప్రారంభిస్తే వర్షాకాలంలో సైతం పనులు చేపట్టే వీలు కలుగుతుంది. లేదంటే భారీ వర్షాలకు ఏడు ఎనిమిదవ బ్లాక్ ల పరిస్థితి ఎవరు ఊహించని రీతిలో ఉండబోతుంది అన్నది వాస్తవం, నిర్మాణ సంస్థ మరియు ఇరిగేషన్ శాఖ మేడిగడ్డ పునర్నిర్మాణ పనులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

మేడిగడ్డ ఏడవ బ్లాక్ మరమ్మత్తు పనులను కొనసాగించుటకు మహారాష్ట్ర వైపు నుండి వచ్చే గోదావరి నీటిని ఫస్ట్ బ్లాక్ గేట్ నెంబర్ 80 నుండి 85 గేట్ల వద్దకు నీటిని మళ్లించడం జరిగింది. ప్రస్తుత నీటి ప్రవాహం నామమాత్రంగానే కొనసాగుతున్నప్పటికీ మరికొన్ని రోజులు పనులు కొనసాగించవచ్చు, కానీ వర్షాకాలం సీజన్ ప్రారంభం మేడిగడ్డ బ్యారేజ్ భారీ వరద తాకిడి ఇరిగేషన్ నిర్మాణ సంస్థ ఏడవ బ్లాక్ మరమ్మతు పనులు కొనసాగించడం సాధ్యమవుతుందా.? బ్యారేజ్ పిల్లర్ల వద్ద 50 మీటర్ల దూరంలోనే పిల్లర్ల వద్ద నుండి వస్తున్న నీటి బుడగలు, భారీ మోటర్లతో తీసివేసినప్పటికీ మరిన్ని నీరు రావడం, సాధారణ పరిస్థితి ఇలా ఉంటే వర్షాకాలం బ్యారేజీలో చేరే సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు మళ్లించడం ఏలా సాధ్యం అవుతుంది, ఏడవ బ్లాక్ పనులు చేపట్టుటకు వీలు ఉంటుందా.! ఈ వర్షాకాలంలో బ్యారేజ్ ఏడవ బ్లాక్ మరమ్మత్తు పనులు సాఫీగా కొనసాగడం జరుగుతుందా లేక భారీ వరద తాకిడి వల్ల పనులు చేపట్టే వీలు కాకుంటే దీనికి ప్రత్యాన్మయం ఏలాంటి ముందస్తు జాగ్రత్తలు వహిస్తారు అనేది సందిగ్ధంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *