నిధులు ఉన్న పట్టింపు లేని గ్రామం
అటవీశాఖ అనుమతులకు అడ్డు ఏంటి
అత్యవసర వైద్య సేవలకు, వ్యవసాయ రాకపోకలకు అధ్వానమైన రోడ్డు
గ్రామంలో ఎవరు ప్రమాదానికి గురైన ప్రభుత్వమే బాధ్యత వహించాలి
వర్షాలు మొదలయినాయి రాకపోకలు స్తంభిస్తున్నాయి
విద్యావంతుల వేదిక సంజీవన్ మహారాజ్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
గుండాల మండల కేంద్రంలోని ముత్తాపురం సమీపంలో గల పెద్దతోగు గ్రామానికి ఆధునిక కాలంలో కూడా కనీస రోడ్డు సదుపాయాలు లేక నిరంతరం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు నిధులు మంజూరై రోడ్డు విస్తరణకు అటవీ అధికారుల అనుమతుల కొరకు ఎదురు చూడడం విచిత్రమైన విషయమని విద్యావంతుల వేదిక, సామాజిక సంఘాల ఐక్యవేదిక, సామాజిక విశ్లేషకులు, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు సంజీవన్ అభిప్రాయపడ్డారు. విద్య, వైద్య, వ్యవసాయ పనులకు, నిత్యవసర వస్తువులకు గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు కనీస రోడ్డు సదుపాయం లేకపోగా అత్యవసర సేవలకు అత్యంత దయనీయంగా ఉంటుంది. మంజూరైన రోడ్డు పనులు మొదలు పెట్టాలని వర్షాకాలం వస్తే వాగులు, ఒర్రెల్లో నీటి ఉదృతి మూలంగా రోడ్డు కొట్టుకుపోయి కనీస అవసరాలకు ప్రజలు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఉండదు కనుక అటవీ శాఖ ఉన్నత అధికారులు స్పందించి వెంటనే న్యాయపరమైన రోడ్డు పనులకు అనుమతులు ఇవ్వవలసిందిగా ప్రజా సంఘాల తరఫున సంజీవన్ తెలియజేశారు.