ప్రజావాణి కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా అధికార యంత్రాంగాన్ని పాలనా తీరును ఆయన అభినందించారు ముసి నందున ఎన్నికల కోడ్ ముగిసినందున జిల్లా కలెక్టర్ తేజస్ నoదలాల్ పబువార్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజావాణి కార్యక్రమంలో ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి చాలాసేపు కూర్చున్నారు . ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను అధికారులు ఎలా పరిష్కరిస్తున్నారు వాటిపై చర్యలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలించారు .ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కారాన్ని గల మార్గాలను జిల్లా కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాదులో ప్రతి మంగళవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ ఇన్చార్జిగా ఉన్నారు అనంతరం చిన్నారెడ్డిని కలెక్టర్ శాలువతో ఘనంగా సన్మానించారు. జిల్లాలో రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు ఉన్నాయని వ్యాపారాలు నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు ఉంటాయని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *