Store Paddy as per Rules: Collector
వరి ధాన్యాన్ని నిబంధనల ప్రకారం నిల్వ చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తున్న కేటాయించిన ప్రకారం గోదాములు,రైస్ మిల్లులలో నిబంధనల ప్రకారం నిల్వ చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్ మండలం కేంద్రంలో గల స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ గోదామును మండల తహసిల్దార్ సంతోష్ తో కలిసి సందర్శించి ధాన్యం నిల్వ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు.కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు,గోదాములకు తరలించాలని తెలిపారు.గోదాములకు తరలించిన ధాన్యం దిగుమతిలో ఆలస్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని,అవసరం మేరకు హమాలీల సంఖ్యను పెంపొందించుకోవాలని తెలిపారు.
ధాన్యం నిల్వ ప్రక్రియ త్వరగా ప్రారంభించాలి
జైపూర్ మండలం ముదిగుంటలో గల బి.ఎస్.వై. రైస్ మిల్, ఇందారంలో గల వరలక్ష్మీ రైస్ మిల్ లను మండల తహసిల్దార్ వనజ రెడ్డి తో కలిసి సందర్శించి ధాన్యం ప్రక్రియను పరిశీలించారు.కొనుగోలు కేంద్రాల నుండి తరలించిన ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేసుకోవాలని, లారీలు వేచి ఉండకుండా తిరిగి పంపించాలని,ఈ క్రమంలో అవసరమైన హమాలీలా సంఖ్య పెంపొందించుకోవాలని తెలిపారు. రైస్ మిల్లర్లకు నిర్దేశించిన లక్ష్యాలను త్వరగా పూర్తి చేసే విధంగా కృషి చేయాలని తెలిపారు.టేకుమట్ల లోగల బాలాజీ గోదాం,కుందారంలో గల అన్నపూర్ణ రైస్ మిల్ గోదామును సందర్శించి ధాన్యం నిల్వ ప్రక్రియ త్వరగా ప్రారంభించాలని నిర్వాహకులకు సూచించారు.
రైస్ మిల్లుల యజమానులు అధికారులతో సమన్యాయంగా కృషి చేయాలి
హాజీపూర్ మండల కేంద్రంలో గల గాయత్రి రైస్ మిల్ ను తహసిల్దార్ పుష్పలతతో కలిసి పరిశీలించారు.కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యం ప్రక్రియ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.సి.ఎం.ఆర్. లక్ష్యాలను వేగంగా పూర్తిచేసేలా రైస్ మిల్లుల యజమానులు అధికారుల సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
