‘‘మల్క ఎంపికే’’..’’బిజేపికి మచ్చ’’?

-మల్కా కొమురయ్య గెలిస్తే తన వ్యాపారాలను జాతీయం చేస్తారా?

-విద్యా సంస్థలను ప్రభుత్వ పరం చేస్తారా?

-ఎమ్మెల్సీగా గెలిచి తన జీత భత్యాలను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వినియోగిస్తారా?

-సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను ఆదుకునేందుకు ఉపయోగిస్తారా?

-రాజ్యాంగ నిపుణులు ఎగువ సభలకు టీచర్లను పంపాలని చెప్పింది …కొమురయ్య లాంటి వారి కోసం కాదు

`కొమరయ్య టీచర్ల కొమ్ముకాసేనా?

`విద్యార్థుల మీద కనికరం లేని కొమురయ్య?

`మల్కతో జరిగే మంచేమిటి?

`ప్రభుత్వ టీచర్లకు ఒరిగేదేమిటి?

`తన టీచర్లతో సాగిస్తున్నదే వెట్టి?

`విద్యా హక్కుకు తూట్లు పొడిచి?

`ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేసి?

`ప్రైవేటు విద్యా సామ్రాజ్యం సృష్టించి?

`మల్క టీచర్‌ ఎలా అవుతాడు?

`ప్రభుత్వ టీచర్ల సమస్యలపై పోరాటం ఏం చేస్తాడు?

`బిజేపి తీసుకున్న నిర్ణయం కరక్టు కాదు!

`అటు టీచర్లు, ఇటు బిజేపి శ్రేణుల తీవ్ర అభ్యంతరం!

`ప్రైవేటు స్కూల్‌ యజమాని కి ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధం ఏమిటి?

`ప్రైవేటు స్కూల్‌ యజమాని ప్రభుత్వ స్కూళ్ల నాశనమే కోరుకుంటాడు?

`ప్రైవేటు విద్యా సంస్థలు విస్తరించాలనుకుంటాడు.

`విద్య ప్రైవేటీకరణ కావాలంటాడు?

`ప్రభుత్వ టీచర్లకు జీతాలే దండగ అంటాడు?

`ప్రభుత్వ టీచర్లకన్నా మా టీచర్లే నయమంటాడు.

`ప్రైవేటు విద్యా సంస్థలు ఫలితాలు తమకు అనుకూలంగా మలుచుకుంటాడు.

`ప్రైవేటు స్కూల్‌ యజమాని ప్రభుత్వ టీచర్ల నెత్తిన తాండవం ఆడతాడు.

`ఆఖరుకు ప్రభుత్వ టీచర్లతోనే విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేయిస్తాడు.

`ప్రభుత్వ టీచర్ల సమస్యలు ప్రైవేటు స్కూల్‌ యజమాని చేతికా!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

స్వాతంత్య్రం వచ్చిన డెబ్బై ఐదేళ్లు పూర్తవుతున్నా మన దేశంలో ఇంకా అపరిష్కృతంగా అనేక సమస్యలున్నాయి. వాటిలో విద్య, వైద్యం ప్రధానమైనవి. ఇంత కాలానికి ఈ మధ్య కేంద్ర ప్రభ్వుతం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ రెండు రంగాలకు అత్యంత ప్రాదాన్యమిచ్చారు. గతంలో ఇంతగా ఆ రెండు రంగాలకు కేటాయించిన సందర్భాలు లేవు. మరి అలాంటి బిజేపి పార్టీ తెలంగాణలో విద్యా రంగానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమురయ్య అనే వ్యక్తికి టెకెట్‌ కేటాయించడంపై బిజేపి శ్రేణులే ముక్కున వేలేసుకుంటున్నారు. ఉపాద్యాయాలు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజేపికి అనుకూలంగా పరిస్దితులు వున్నాయని అనుకునే లోపే బిజేపి పార్టీ టీచర్స్‌ ఎమ్మెల్సీ విషయంలో ప్రైవేటు టీచర్‌, విద్యా సంస్ధల అదినేత, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తికి ఇవ్వడంపై తెలంగాణ సమాజం నుంచి కూడా వ్యతిరేకత ఎదురైంది. ఆ పార్టీలో అనేక మంది ఉపాద్యాయ వృత్తిలో వున్న సానుభూతి పరులున్నారు. ఉపాధ్యాయ అనుబంద సంఘాల నాయకులు కూడా వున్నారు. వారిని కాదని ప్రైవేటు విద్యా సంస్దల అదినేత మల్క కొమురయ్యకు టికెట్‌ ఇచ్చి రావాల్సిన ఓట్లను కూడా దూరం చేసుకున్నట్లైందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. మన దేశంలో ఇప్పటికీ ఎనభై శాతానికి పైగా ప్రజలు విద్యను కొనుక్కునే పరిస్దితి లేదు. అందులోనూ మల్క కొమురయ్య లాంటి విద్యా సంస్దల్లో విద్యను కొనుగోలు చేయాలంటే మధ్య తరగతి ప్రజలకు కూడా సాధ్యం కాదు. ఉన్నత శ్రేణికి చెందిన కుటుంబాల పిల్లలుతప్ప సామాన్యుల పిల్లలకు ఆయన విద్యా సంస్ధల్లో సీటు కూడా దొరకదు. అలాంటి విద్యా సంస్ధలను నిర్వహించే మల్క కొమురయ్యకు సామాన్యుల కష్టాలు తెలిసిన ఉచిత విద్య అందించే అవకాశం లేదు. కనీసం ఫీజలు తగ్గించే పరిస్ధితి అంతకన్నా లేదు. ఆయన విద్యా సంస్ధలపై కూడా అనేక రకాల ఆరోపణలున్నాయి. ఇటీవలే ఆయనకు చెందిన ఓ స్కూల్‌లో ఫీజులు చెల్లించలేదని ఆడపిల్లలను స్కూల్‌ బైట నిలబెట్టారని ఆ స్కూల్‌ ముందు తల్లిదండ్రులు నిరసనచేపట్టారు. మల్క కొమురయ్యను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఆయన స్కూల్‌లో ఫీజలుంపై తూర్పార పట్టారు. అలాంటి మల్క కొమురయ్యకు టీచర్స్‌ ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చారు. కనీసం ఇచ్చే ముందైనా మల్క కొమురయ్య అలాంటి టికెట్‌కు అర్హుడా? కాదా? అన్నది కూడా బిజేపి పార్టీ ఆలోచించకపోవడం విడ్డూరం. ఎందుకంటే మల్క కొమురయ్య స్వతహాగా ప్రభుత్వ టీచర్‌ కాదు. ప్రైవేటు టీచర్‌ అయినా ఆయన విద్యా సంస్దల అదినేత. ఇతర వ్యాపకాలు అనేకం వున్నా వ్యాపారి. మరి అలాంటి వ్యక్తి ప్రభుత్వ ఉపాద్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే అవకాశం వుందా? ప్రభుత్వ విద్య తీరుపై సూచనలు,సలహాలు ఇచ్చే అవకాశాలుంటాయా? ప్రభుత్వ విద్యా విధానంలో నూతన ఒరవడుల కోసం ఆయన కృషి చేసే అవకాశం వుంటుందా? అంటే నూరు శాతం వుండదు. ఎందుకంటే స్వతాహాగా ఆయన ప్రైవేటు టీచర్‌. ఆయనకు ప్రభుత్వ టీచర్ల సమస్యల మీద అవగాహన శూన్యం. ఇప్పుడు ఆయన టీచర్లు ఎదుర్కొనే సమస్యలు తెలిజేస్తే తప్ప ఆయనకు తెలియదు. ప్రతి విషయాన్ని టీచర్లు ఆయనకు ప్రత్యేకంగా వివరించాలి. ముఖ్యంగా టీచర్లు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకోవాలన్నా ఆయనకు కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఒక్క రోజులో వాటిని అవగాహన చేసుకోవడం కష్టం. టీచర్లకు ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన జీవోలు. వాటి వల్ల ఎదురైన పరిణామాలు. టీచర్ల ట్రాన్ఫ్‌ర్లు. స్కూళ్లలో మౌళిక సదుపాయాలు. స్కూల్‌ బిల్డింగులు. ల్యాబ్‌లు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. వాటితోపాటు ఉపాధ్యాయుల పెన్సన్లు. జీతాల పెరుగుదల. డిఏలు వంటి అనేక సమస్యలుంటాయి. మల్క కొమురయ్య నిర్వహించే విద్యా సంస్ధల్లో టీచర్లకు ఇలాంటి సమస్యలు ఏమీ వుండవు. పైగా మన రాజ్యాంగ నిపుణులు ఎంతో కష్టపడి విద్యా వ్యవస్ధ ఎలా వుండాలి. అని ఎంతో కాలం ఆలోచించి రాజ్యాంగ కమిటి పెద్దల సభలో అన్ని రంగాలలో నిపుణులకు ఎలా చోటు కల్పించాలని మధనం చేసి సీట్ల కేటాయింపులు చేశారు. అందులో ఎగువ సభలైన రాజ్యసభ, ఇటు రాష్ట్రంలో మండలిలో టీచర్లకు సీట్లు కేటాయించారు. మరి అలాంటి టీచర్ల సమస్యలపై గళం వినిపించాలంటే ప్రైవేటు స్కూల్‌ యాజమానికి టికెట్‌ కేటాయించే రోజులు వస్తాయనే ముందుగానే ప్రభుత్వ ఉపాధ్యాయుల ఎంపికలు చేపట్టారు. కాని బిజేపి మల్క కొమురయ్యకు టికెట్‌ కేటాయించి పొరపాటు చేసింది. రాను రాను ఎగువ సభల్లో ప్రత్యేక సీట్లలో కూడా రాజకీయ నాయకులతో భర్తీ చేయడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం. ఇతర రంగాలకు చెందిన సీట్లను కూడా ఇలాగే భర్తీ చేస్తే అసలు రాజ్యాంగ మౌళిక స్వరూపానికే దెబ్బ తగిలినట్లౌవుంది. ప్రైవేటు విద్యా సంస్దలు నడుపుతూ టీచర్ల సమస్యలపై గళం విప్పడానికి, విద్యా రంగంలో విప్లవాత్మకమైనమార్పులకు శ్రీకారం చుట్టడానికి అవసరమైన టీచర్స్‌ ఎమ్మెల్సీగా గెలిస్తే ఆయన ఆస్దులను జాతీయం చేస్తారా? ఆయన విద్యా సంస్దలను ప్రభుత్వ పరం చేస్తారా? ఇక ఆయనకు ఎమ్మెల్సీగా వచ్చే జీతాన్ని టీచర్ల అభ్యున్నతి కోసం, టీచర్ల యూనియన్‌ భవనాల కోసం కేటాయిస్తారా? అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న టీచర్లను ఆదుకునేందుకు వినియోగిస్తారా? ప్రభుత్వ స్కూళ్లలో అత్యుత్తుమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించేందుకు వినియోగిస్తారా? ఎందుకంటే ఒక సామాన్య ఉపాద్యాయుడు ఎమ్మెల్సీ అయితే ఆయనకు వుండే అంకిత బావం వ్యాపారులకు వుండదు. ఒక వ్యాపారికి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనే వుంటుంది. అలాగే మల్క కొమురయ్యకు ఎమ్మెల్సీ పదవిని అడ్డం పెట్టుకొని మరిన్ని విద్యా సంస్ధలను ఏర్పాటు చేసుకునే వీలు ఏర్పడుంది. తన విద్యా సంస్దలను యూనివర్సిటీ స్ధాయికి పెంచుకునేందుకు మార్గం పడుతుంది. ఇలా ఆయన వ్యక్తిగతంగా మరింతగా ఎదిగేందుకు, రాజకీయంగా మరింత ముందడుగు వేసేందుకు అవకాశం ఏర్పడుంది. విద్యా వ్యవస్ధకు ఏం ఒరుగుతుంది? అన్నది కూడా ఆలోచించాలి. తన విద్యా సంస్ధలలో పనిచేసే ఉపాధ్యాయకులకు కనీస వేతనాలు అందించలేని కొమురయ్య, ప్రభుత్వ టీచర్ల జీతాల పెంపుకోసం మండలిలో ప్రశ్నించే వీలుంటుందా? అదే జరిగితే మిగతా ఎమ్మెల్సీలు ముందు తమ స్కూళ్లలో ప్రభుత్వ ఉపాద్యాయులకు ఇస్తున్న వేతనాల్లో కనీసం సగమైనా ఇస్తున్నావా? అన్న ప్రశ్నలు ఎదుర్కొవాల్సి వస్తుంది? అంతే కాకుండా విద్యా హక్కు చట్టం ప్రకారం 15శాతం ఉచిత విద్యను అన్ని స్కూళ్లలో అమలు చేస్తున్నారా? అన్నది కూడా అసెంబ్లీలో వెల్లడిరచాల్సి వస్తుంది? ఫీజుల చెల్లింపులో ఆలస్యం జరిగినందుకే స్కూల్‌ గేటు ముందు ఎండలో పిల్లలను నిలబెట్టిన మల్క కొమురయ్య, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఒక వేళ లెక్కల కోసం రికార్డులు చూపించినా అందులో వాస్తవం ఎంత వుంటుందో తెలియంది కాదు. నేతిబీరకాయలో నెయ్యిలాగే వుంటుంది. మన సమాజంలో ఉపాధ్యాయకులు ఎంతో విలువైన స్దానం వుంది. కాని ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లకు ఆ గౌరవం యాజమాన్యం నుంచి వుంటుందా? పిల్లలకు చరిత్ర పాఠాలన భోదించే ఉపాధ్యాయుడు రాజుల కాలంలో వెట్టి చాకిరి గురించి పాఠాల బోధించేప్పుడు తాను చేస్తున్న వెట్టి చాకిరి గురించి మధనపడకుండా వుంటాడా? విద్యార్దుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ, టీచర్లకు కనీస వేతాలను దేవుడెరుగు, కుటుంబ పోషణకు సరిపడ జీతం అందుతుందా? అసంఘటిత కార్మికుడు నిత్యం సంపాదించే సంపాదనలో సగం కూడా రోజు కూలీ గిట్టని వారు ప్రైవేటు ఉపాధ్యాయులు. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో సబ్జెక్టును బట్టి జీతాలు వుండవు. జీతాల్లో తేడాలు కనిపించవు. కాని ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే మాధ్స్‌ చెప్పే టీచర్‌కు, తెలుగుబోధించే టీచర్‌కు ఒకే రకమైన జీతం ఇస్తారా? ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే తెలుగు టీచర్‌కు అందరికన్నా తక్కువ జీతం ఇస్తారు. చేస్తే చేయిలేకుంటే లేదంటారు. ఇలా టీచర్లకు ఇచ్చే అరకొర జీతాల్లోనే కోతలు పెట్టే ప్రైవేటు స్కూల్‌ యాజమానికి మల్క కొమురయ్య ఎమ్మెల్సీ అయితే కనీసం తన విద్యా సంస్ధలల్లో పనిచేసే టీచర్లకు ప్రభుత్వ ఉపాద్యాయులు అందుకుంటున్న జీతాలు ఇస్తానని వాగ్ధానం చేయగలడా? ప్రైవేటు విద్యా సంస్దలు నిర్వీర్యమై, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాడా? నిజం ఇలా చేదుగా వుంటుంది. మల్క కొమురయ్యను ఎంపిక చేయడం కూడా అంతే చేదుగా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!