Congress Protests Over BJP Remarks on Telangana
తెలంగాణపై విషం చిమ్మితే చూస్తూ ఊరుకోం…
మంచిర్యాల డిసిసి అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి
బిజెపి ఎంపీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి..
పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, వోడ్నాల శ్రీనివాస్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి :
తెలంగాణ ఏర్పాటుపై బిజెపి ఎంపీలు విషం చిమ్మితే చూస్తూ ఊరుకోబోమని మంచిర్యాల డిసిసి అధ్యక్షులు పిన్నింటి రఘునాధ రెడ్డి హెచ్చరించారు. బిజెపి ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, వోడ్నాల శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు.శనివారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్ కమాన్ వద్ద రాస్తారోకో చేసి, బిజెపి ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మని కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, వోడ్నాల శ్రీనివాస్ లతో కలిసి జిల్లా డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

బిజెపి ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, తెలంగాణ ఏర్పాటు ఇండియా పాకిస్తాన్ విభజన లాగా జరిగిందని అవహేళనగా మాట్లాడడం అవివేకం అని అన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరూ స్వరాష్ట్రం కోసం పోరాడి ప్రాణ బలిదానాలకు సిద్ధపడి తెలంగాణ తీసుకొచ్చుకుంటే బిజెపి ఎంపీలు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. లోక్ సభలో ఇంత జరుగుతున్న బిజెపి తెలంగాణ ఎంపీలు, మంత్రులు నిలదీయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపతి రాజయ్య, జంగం కళ, జిల్లా కార్యదర్శి గోపతి భానేష్, కౌన్సిలర్లు గుర్రం శ్రీనివాస్, భీమ మల్లేష్, కూతురు ప్రభాకర్, నాయకులు సుధాకర్, పనాస రాజయ్య, లక్ష్మారెడ్డి, ప్రేమ్ సాగర్ ,రామ్ సాయి, లచ్చులు, నాయకురాళ్ళు పుష్ప, సృజన , పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
