విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షులు,జలంధర్ చారి
ఇబ్రహీంపట్నం, నేటి ధాత్రి
మండలంలోని ఉన్నటువంటి అన్ని కులాలు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని వివిధ చేతి వృత్తుల వారు వినియోగించుకోవాలని ఇబ్రహీంపట్నం, విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షుడు,మద్దెనపల్లి జలంధర్,మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అటువంటి చేతివృత్తుల వారి కోసం మరియు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం విశ్వకర్మ యోజన పథకం ద్వారా 18 కులాలు లబ్ధి పొందనున్నాయి వారికోసం 11 వేల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ పథకం ద్వారా చేతివృత్తుల వారికి 15 రోజులపాటు శిక్షణ ఇచ్చి మరియు రోజుకు 500 రూపాయల చొప్పున మరియు శిక్షణ కాలం పూర్తి అయిన తర్వాత 15 వేల రూపాయలు విలువ చేసి టుల్ కిట్, మరియు సర్టిఫికెట్ ఉచితంగా ఇస్తున్నారు అనంతరం తక్కువ వడ్డీకే విడతల వారీగా మొదటి విడత లక్ష రూపాయలు మరియు రెండో విడత రెండు లక్షలు నుంచి మూడు లక్షల వరకు ఇస్తున్నారు ఈ పథకాన్ని మండలంలో ఉన్నటువంటి వివిధ కులవృత్తుల వారు వినియోగించుకోవాలని అయినా మాట్లాడారు.