పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వీరాపురం గ్రామంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సందర్భంగా 10 లక్షల ఖర్చుతో కూడిన వీరాపురం ఆర్ అండ్ బి రోడ్డు నుండి వజ్జ శ్రీను పొలం వరకు గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన పాయం అనంతరం గ్రావెల్ రోడ్డు పనిని ప్రారంభించిన
పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు , అదేవిధంగా రేగళ్ల పంచాయతీ మాదన్న గూడెంలో ఎన్నో ఏళ్లుగా కరెంటు లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం దృష్టికి మాదన్న గూడెం గ్రామస్తులు తీసుకురాగానే తక్షణమే స్పందించి ఎమ్మెల్యే పై అధికారులతో మాట్లాడి రెండు లక్షల ఖర్చుతో 25 కెవి ట్రాన్స్ఫారాన్ని మదన గూడెం గ్రామంలో నూతనంగా నిర్మించి గ్రామస్తుల సమక్షంలో ట్రాన్స్పరాన్ని కొబ్బరికాయ కొట్టి నూతనంగా ప్రారంభించారు అడిగిన వెంటనే స్పందించిన పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయంకు మాదన్న గూడెం గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఇక్బాల్ హుస్సేన్ గారు, మాజీ సర్పంచ్ తోలేం నాగేశ్వరరావు, పడిగ సమ్మయ్య, బెజ్జ రామనాథం, పోలేబోయిన తిరుపతయ్య, ఎర్ర సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు