లంచాలు తీసుకొని పనిచేసే వారికి ఐక్యవేదిక భయపడదు

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో నియోజకవర్గంలో లంచాలు తీసుకొని రోడ్లు శుభ్రపరిచే వారితో మురికి కాలువలు తీసేవారితో మున్సిపాలిటీలో హాస్పిటల్లో కలెక్టరేట్లో లంచాలు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించిన వారికి భయపడ దని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ సెల్ నెంబర్ 9490094100 తెలిపారు మూడు నెలలుగా జీతాలు ఇప్పించిన కారణంగా వారి పేర్లు బయటపెడతామని బయపడి ఐక్యవేదిక ను బెదిరింపు లకు పాల్పడుతున్న రని ఆయన విమర్శించారు
4 సంవత్స రాల నుండి దాదాపు 40 మంది ఐక్యవేదికను బెదిరిస్తున్నారని అలాంటి వారి కి బెదరలేదని ఇప్పుడు ఇతర పార్టీల నుండి అధికార పార్టీలోకి వచ్చి ఐక్యవేదిక బెదిరిస్తున్నారని వారి తాటాకు చప్పుళ్ళకు బెదరదని ఆయన తెలిపారు ప్రజల పక్షాన ఐక్యవేదిక పనిచేస్తున్నదని బిసి సదస్సు విజయవంతమైనందుకు వారు జీర్ణించుకోలేకపోతున్నారని అలాంటి వారికి
తగిన గుణపాఠం చెప్తామని ఆయన పేర్కొన్నారు బీసీలు కొందరు ఏకమై విడదీయాలని చూస్తున్నారని అలాంటి వారికి భయపడమని అవినీతి అక్రమాలను బయటపెడతామని ఆయన తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *