Support for Heart Surgery Patient
ఓపెన్ హార్ట్ సర్జరీ బాధితుడికి అండగా ఉబుంటు టీం
ఆటోడ్రైవర్ షరీఫ్‌కు రూ.8 వేల ఆర్థికసాయం, సర్పంచుల చేతుల మీదుగా అందజేత
నర్సంపేట/గీసుకొండ,నేటిధాత్రి:
గుండె సంబంధిత వ్యాధితో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద ఆటోడ్రైవర్‌కు ఉబుంటు టీం అండగా నిలిచింది.వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రానికి చెందిన షేక్ అంకూస్ పాషా (షరీఫ్) ఇటీవల హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎలాంటి ఆదాయం లేక మందులకే కాకుండా కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఉబుంటు టీం రూ.8,000 ఆర్థిక సాయం అందించింది.
ఈ నగదును గీసుకొండ సర్పంచ్ వీరగొని రాజు కుమార్, మనుగొండ సర్పంచ్ పేర్ల శ్రవణ్ చేతుల మీదుగా బాధితుడికి అందజేశారు. కార్యక్రమంలో ఉబుంటు టీం ప్రతినిధులు కర్ణకంటి రాంమూర్తి, మండ నవీన్, స్థానిక నాయకులు దౌడు సునీల్, దౌడు రాజు, పొగాకు బిక్షపతి, రాగిరి రాజేందర్, సోషల్ మీడియా వారియర్ బానోత్ రేవంత్ రాథోడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ వీరగొని రాజు కుమార్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న తమ గ్రామస్థుడికి సాయం అందించడం అభినందనీయం అని అన్నారు.విద్య, వైద్యం, పేదరికం వంటి సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఉబుంటు టీంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
