Karate Summer Camp Launched in Hanamkonda
హన్మకొండలో ఘనంగా సమ్మర్ కరాటే కోచింగ్ క్యాంప్ ప్రారంభం
హన్మకొండ, నేటిధాత్రి:
స్థానిక పద్మాక్షి టెంపుల్ ఆవరణలోని ఎస్.ఆర్ వివేకానంద హైస్కూల్లో బి.ఎమ్.ఆర్. కరాటే డూ & కిక్ బాక్సింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరం (సమ్మర్ క్యాంప్) మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి వరంగల్ (వెస్ట్) ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి శిక్షణ శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి కాలంలో ఆత్మరక్షణ విద్యల ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ముఖ్యంగా బాలికలు కరాటే కాటాస్, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, కిక్ బాక్సింగ్ మరియు వివిధ రకాల జంప్స్ నేర్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ శిక్షణ శిబిరం 45 రోజుల పాటు, అంటే జూన్ 10వ తేదీ వరకు కొనసాగుతుంది.
ఈ అకాడమీకి సంబంధించిన శిక్షణ తరగతులు హన్మకొండలోని ఎస్.ఆర్ వివేకానంద స్కూల్‌తో పాటు రెడ్డి కాలనీ, గోకుల్ నగర్, అలంకార్ జంక్షన్, సుబేదారి, జవహర్ కాలనీ, రాంనగర్, కరీమాబాద్ వంటి పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 9000586435, 9100658538, 7659825388.
పాల్గొన్న ప్రముఖులు
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 10వ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకన్న , డివిజన్ ప్రెసిడెంట్ కుమార్ యాదవ్, తోట పవన్ పాల్గొన్నారు. వీరితో పాటు బి.ఎమ్.ఆర్. కరాటే డూ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తెలంగాణ ఫౌండర్ & డైరెక్టర్ బండారి సంతోష్, కోచ్‌లు నరేష్, దినేష్, గణేష్, కరుణాకర్, వెంకటేష్, వైష్ణవి, ఆసియా తదితరులు పాల్గొన్నారు.
