`తెలంగాణ చెరువులను చెరపట్టిన కులం ట్యాగ్ లైన్ వ్యాపారులు!
`హైదరాబాదుకు వలసలు తెచ్చిందే ఎన్టీఆర్!
`వలసలను వరద ప్రవాహం చేసింది చంద్రబాబు.
`హైదరాబాద్‌ను బురద మయం చేసింది రాజశేఖరరెడ్డి.
`చెరువులను మింగి సెజ్‌లంటూ దోచుకున్నారు.
`రియల్ పేరు చెప్పి తెలంగాణను పీల్చి పిప్పిచేశారు.
`ఆంధ్రా అభివృద్ధికి తెలంగాణ భూములు అమ్మేశారు.
`హైదరాబాద్ చుట్టున్న చెరువులు కమ్మేశారు.
`హైదరాబాద్ చుట్టూ చెరవులను చెరపట్టేలా చేసిందే ఉమ్మడి పాలకులు.
`బ్రహ్మానంద రెడ్డి మొదలుపెట్టారు.
`ఎన్టీఆర్ కిటికీలు తెరిచారు.
`చంద్రబాబు దర్వాజలు తెరిచారు.
`రాజశేఖరరెడ్డి ఇల్లే కూల్చేశారు.
`సీమాంధ్రకు చెందిన రెండు కులాలు హైదరాబాద్ నిండిపోయారు.
`భూములు ఆక్రమించుకున్నారు.
`వడ్డించే ఆ కులాలే ఎక్కువ కాలం కుర్చీలో వున్నారు.
`హైదరాబాద్ చెరువుల్లో అంతస్తులు లేపి బ్రాండ్ ఇమేజ్ పెంచామన్నారు.
`అప్పటిదాకా చెన్నై వెళ్లే కులాలను హైదరాబాద్‌కు దారి మళ్లించారు.
`రియలెస్టేట్ పేరుతో భూముల్లో పాగా వేయించారు.
`తొండలు కూడా గుడ్లు పెట్టవంటూనే బంగారు బాతుల్లా మార్చుకున్నారు.
`హైదరాబాద్‌ను ఆగమాగం చేశారు.
`తెలంగాణ పేదలకు నగరంలో స్థానం లేకుండా చేశారు.
`కుంటలు మింగేశారు. ఆనవాలు చెరిపేశారు.
`చెరువులు మాయం చేశారు.
`ఉమ్మడి పాలకుల నుంచి అడ్డికిపావుసేరుకు కొన్నారు.
`వ్యాపారాల పేరుతో భూములు తీసుకున్నారు.
`రియల్ వ్యాపారం మొదలుపెట్టారు.
`అర్భన్ డెవలప్‌మెంట్ అంటూ హైదరాబాద్‌ను అతలాకుతలం చేశారు.
`తెలంగాణ బతకులను కూల్చారు.
`పాలమూరుపై పగపట్టారు.
`పల్లెలను ఎండబెట్టారు.
`సమైక్య నీతిని తుంగలో తొక్కారు.
`కలిసుంటే కలదు సుఖమంటూ, తెలంగాణ ఉసురు పోసుకున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఆ రెండు కులాలు కలిసి సాగించిన చెరువుల విధ్వంసం ఇప్పుడు హైదరాబాద్ వాసులకు శాపంగా మారింది. ఒకప్పుడు ఖమ్మం వరకే పరిమితమైన ఆ కులం హైదరాబాద్ చేరింది. పెత్తనం మొదలు పెట్టింది. చెరువులను చెరపట్టి ఆగం చేసింది. కలిసి వుంటే కలదు సుఖమని ఓ కులం పాట పాడిరది. తర్వాత తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో రాజకీయాల్లోకి వచ్చి మరో కులం తెలంగాణను దోచుకున్నది. మొత్తంగా రెండు కులాల మూలంగా తెలంగాణ అస్థిత్వం మాయమైంది. ప్రకృతి పాడైపోయింది. ప్రకృతి సంపద నాశనమైంది. కలిసి వుంటే కలదు సుఖమని చెప్పి, సమైక్య భావన ముసుగులో తెలంగాణనే ద్వితీయ శ్రేణిని చేసి దోచుకున్నారు. తెలంగాణ వనరులు దోపిడీతోపాటు, హైదరాబాద్ భూముల చెర మొదట కాసు బ్రహ్మానందరెడ్డితో మొదలై, ఎన్టీఆర్ హాయాంలో గండిపేట దాకా పాకింది. నగరంలో వుండాల్సిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గండిపేటలో మకాం పెట్టి, చుట్టూ భూములను ఆ కులానికి అప్పగించడం మొదలు పెట్టాడు. తర్వాత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చుట్టూ వున్న భూములన్నీ తన కులబాంధవులకు కట్టబెట్టారు. మురళీమోహన్ లాంటి ఓ చిన్న హీరో ఇప్పుడు వేల కోట్లకు అదిపతులయ్యేలా చేశారు. అలా సీమాంద్ర ప్లస్ కులం మనదైతే చాలు..పంచడానికి హైదరాబాద్ చుట్టూ వున్న భూములకు కేక్‌లు చేసుకొని తిన్నారు. ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు పంచుకున్నారు. ప్రభుత్వ భూముల కాజేశారు. చెరువులు చెర పట్టారు. కుంటలు మాయం చేశారు. బహుళ అంతస్ధుల భవనాలు నిర్మాణం చేసుకున్నారు. ఐటి రాకతో హైదరాబాద్ మొత్తం ఆక్రమించుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో ఎటు చూసినా సీమాంధ్రకు చెందిన ఆ రెండు కులాలే కనిపిస్తాయి. ఆ ప్రాంత నాయకుల బంధుగణాల ఆస్ధులు వున్నాయి. అయితే వ్యాపారులు, లేకుంటే నాయకులు, వారి తొత్తులు హైదరాబాద్‌లో గజం జాగా లేకుండా ఆక్రమించుకున్నారు. అప్పటి అధికారులు కూడా , సీమాంధ్రకు చెందిన వారే కావడంతో అందరూ కలిసి చెట్టు, పుట్ట, చేను , చెలక, కుంట, చెరువు ఆఖరుకు అసైండ్ భూములు, నాలాలు కూడా కబ్జాలు పెట్టారు. ప్రకృతి శోభతో అలరాలిన హైదరాబాద్‌ను కాంక్రీట్ జంగల్‌ను చేశారు. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్‌లో కొండలు మాయం చేశారు. తెలంగాణ వారికి హైదరాబాద్ నగరం దగ్గర కావడంతో అక్కడ స్ధిర, చరాస్ధులు సంపాదించుకోవాలన్న ఆలోచన అంతగా వుండేది కాదు. తెలంగాణ నాయకులు కూడా హైదరాబాద్‌లో ఆస్ధులు కూడ బెట్టుకోవాలన్న ఆలోచన చేసేవారు కాదు. కాని తెలంగాణ నాయకులు సీమాంధ్ర నాయకుల చెప్పుచేతల్లో వుండడం అలవాటు చేసుకున్నారు. పదవుల కోసం పాకులాడడమే నేర్చుకున్నారు. తెలంగాణకు రావాల్సిన వాటాల గురించి ప్రశ్నించడం మర్చిపోయారు.
ఉమ్మడి రాష్ట్ర నేతలుగా ఎదగాలన్న కసితో రాజకీయం చేసిన నేతలు తెలంగాణలో కనుమరుగయ్యారు.
సీమాంధ్ర నేతలు ఆడిరచే తోలుబొమ్మలయ్యారు. పేరుకు ఎమ్మెల్యేలైనా సీమాంధ్ర నేతల పెత్తనం కింద పనిచేస్తూ వచ్చారు. అక్కడి నాయకులకు జేజేలు పలుకుతూ వచ్చారు. వారి కొమ్ముకాస్తు తెలంగాణ నాశనమౌతున్నా పట్టించుకోలేదు. అయితే అంతో ఇంతో కాంగ్రెస్ అధికారంలో వున్నంత కాలం తెలంగాణ కాంగ్రెస్ నాయకుల హవా అంతో ఇంతో నడిచేది. కాని ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆత్మగౌరం అన్న పదానికి అర్దం లేని వాళ్లంతా పార్టీలో చేరారు. ఎన్టీఆర్ కాళ్లు మొక్కి పదవులు పొందడం నేర్చుకున్నారు. ఎన్టీఆర్‌ను దేవుడిగా ఆరాధించి పదవులు పొందారు. తెలంగాణలో ఇతర నాయకుల మీద లేని పోని చెప్పుడు మాటలు చెప్పి పదవులు పొందిన వారున్నారు. ఇలా బానిస బతుకులకు అలవాటు పడిన తెలంగాణ నేతల బలహీనతలు సీమాంద్ర నేతుల సొమ్ముచేసుకున్నారు. తెలంగాన సంపద అంతా కొల్లగొట్టారు. తెలంగాణ భూములు ఆక్రమించుకున్నారు. తెలంగాణ రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. తెలంగాణ నేతలు మాత్రం ఎన్టీఆర్ భజన చేసుకుంటూ కాలం గడిపారు. వెన్నెముక లేని నాయకులుగా మారిపోయారు. తర్వాత వచ్చిన చంద్రబాబు అంతకు మించి తెలంగాణ నాయకుల వెన్ను విరిచేశారు. చంద్రబాబును తలెత్తి చూడలేని స్ధితికి తెచ్చారు. తర్వాత వైఎస్. రాజశేఖరరెడ్డి కూడా అదే దారిలో నడిచాడు. తెలంగాణ నాయకులను మరింత ఉత్సవవిగ్రహాలను చేశారు. తెలంగాణ నేతలతోనే తెలంగాణ కంట్లో పొడిచారు. తెలంగాణ ఆస్ధులను కొల్లగొట్టారు. చెరువులను మింగిన ఘునులయ్యారు. హైదరాబాద్‌లో ఎటు చూసినా సీమాంద్రులే కనిపించేలా చేశారు. తెలంగాణ ఒకప్పుడు అధ్భుతమైన ప్రాంతం. ప్రపంచంలోనే వజ్రాలకు ప్రసిద్ది గాంచిన గోలుకొండ. అలాంటి తెలంగాణను కలిసుందామని వచ్చి, తెలంగాణను పీల్చి పిప్పి చేశారు. తెలంగాణను ఆగం చేశారు. పాలమూరును ఎండబెట్టారు. వలస జిల్లాగా మార్చారు. కరువు పేరుతో కకావికలం చేశారు. ఆంధ్రా నుంచి కులం తొత్తులను తెచ్చుకొని హైదరాబాద్ చుట్టూ నింపేశారు. హైదరాబాద్ భూములను రూపాయి లెక్కన చొప్పున బేకరీలో కేకులు పంచినట్లు పంచారు. వందల ఎకరాలు కట్టబెట్టారు. వేలాది ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. లక్షలాది ఎకరాలు గుప్పిట్లో పెట్టుకున్నారు. కాకతీయులు పాలించిన కాలంలో తెలంగాణ వ్యాప్తంగా గొలుసుకట్టు చెరువులతో హైదరాబాద్‌ను అందమైన నగరంగా మార్చారు. తర్వాత కుతుబ్‌షాషీలు, నిజాంలు హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దారు.
మద్రాసులో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకలేక, నీది తెలుగే, మాది తెలుగే , మనందరిదీ తెలుగే అని నమ్మించారు.
తెలంగాణను ఆక్రమించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఒక్కటై తెలంగాణను పీల్చి పిప్పి చేశారు. అర్భన్ డెవలప్ మెంటు పేరుతో చెరువులను నాశనం చేశారు. చెరువులను పూడ్చి కాంక్రీట్ జంగిల్ చేశారు. ఒకప్పుడు దేశంలో ఏ నగరంలో నీటి కరువు వచ్చినా, హైదరాబాద్‌లో మంచినీటి కటకట లేదు. తొలుత కాంగ్రెస్ పాలకులతో పెద్దగా విద్వంసంకాలేదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వచ్చిందో అప్పటి నుంచి హైదరాబాద్ విధ్వంసం మొదలైంది. హైదరాబాద్ సీమాంద్రుల తో నిండిపోయింది. ఏపిలో అడుక్కు తినే స్దితిలో వున్న ఓ కులమంతా చేరి, హైదరాబాద్‌లో కుభేరులయ్యారు. హైదరాబాద్‌లోనే తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చి, ఆగం చేశారు. తెలంగాణ రాజకీయాలను గుప్పిట్లో పెట్టుకొని, అవకాశవాదులైన మన నేతలతోనే మన కంట్లో పొడిపించారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో బంజారహిల్స్, జూబ్లీ హిల్స్ అంటే అందమైన కొండలు, చెరువులతో ఆహ్లాదరకమైన వాతావరణంతో అలరాలేది. తెలంగాణలో ఎన్టీఆర్‌తో మొదలైన విధ్వంసం, చంద్రబాబుతో పరాకాష్టకు చేరింది. వైఎస్ తర్వాత మరింత చెల్లాచెదురైంది. హైదరాబాద్ చెరువులేని ప్రాంతంగా మారింది. ఎడారిగా బండబారింది. హైదరాబాద్ చుట్టూ ఒకప్పుడు 4500 చెరువులు వుండేవి. అవన్నీ మంచినీటి సరస్సులుగా అలరాలేవి. ఇప్పుడున్న హుస్సేన్ సాగర్ కూడా సరిగ్గా వంద సంవత్సరాల క్రితం వరకు కూడా మంచినీటి తటాకంగా వుండేది. ఎప్పుడైతే ఉమ్మడి పాలకులు చొరబడ్డారో తెలంగాణ ప్రాంతాన్నే కాదు, సంస్కృతిని విధ్వంసం చేశారు. తెలంగాణ అస్ధిత్వాన్ని కాల రాశారు. తెలంగాణలో వున్న కొన్ని వేల చెరువులను పట్టించుకోలేదు. చిన్న నీటి పారుదల పేరుతో చెరువుల బాగు కోసం రూపాయి కూడా ఖర్చు చేయకుండా తెలంగాణ ఆదాయాన్నంతా ఆంద్రాకు తరలించి అక్కడి భూములకు సాగునీరందించారు. అక్కడి రైతులంతా వచ్చి తెలంగాణ చెరువులను ఆక్రమించి, ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. తెలుగుదేశానికి చెందిన సీమాంధ్ర నాయకులు, సినీ రంగానికి చెందిన వాళ్లు, ఓ కులానికి చెందిన అనుయాయులంతా తెలంగాణ పుట్టలో చీములుగా దూరిపోయారు. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు వ్యాపారాల పేరుతో చంద్రబాబు నేతృత్వంలో భూములను పంచుకున్నారు. రియల్ వ్యాపారం మొదలు పెట్టారు. ప్రభుత్వ ప్రోత్సాహాకాల పేరుతో భూములు తీసుకున్నారు. ఆ భూముల పేరు చెప్పి బ్యాంకుల్లో కోట్లకు కోట్లు రుణాలు తీసుకున్నారు. రకరకాల వ్యాపారాలు మొదలు పెట్టారు. ఇక్కడ స్దిరపడి తెలంగాణ సాగును విధ్వంసం చేశారు.
తెలంగాణ భూములు సాగుకు పనికిరావన్నారు.
తెలంగాణ వాళ్లకు అన్నమే తెలియదన్నారు. తెలంగాణ ప్రజలకు బద్దకమెక్కువని ఎగతాళి చేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పధకంతోనే తెలంగాణ ప్రజలు అన్నం తినడం నేర్చుకున్నారు. ఇలా తెలంగాణ పల్లెల్లో వుండే చిన్న చిన్న ఉద్యోగాలు కూడా కొల్లగొడుతూ వచ్చారు. దానికి తోడు తెలంగాణలోవున్న నదీ పరివాహక ప్రాంతాలలో స్ధిరపడుతూ వచ్చారు. అక్కడి రైతులనుంచి అడ్డికిపావుసేరు ధరకు భూములు కొనుగోలు చేసి, తెలంగాణ రైతులనే కూలీలుగా మార్చారు. ఇదంతా ఒక పధకం ప్రకారం చేశారు. దాంతో చైతన్యమైన తెలంగాణ సమాజం ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది.. పోరాటంలో కొన్ని వేల మంది ప్రాణాలను కోల్పోతూ వచ్చింది. ఆఖరుకు కేసిఆర్ తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి, తన స్వార్ధంకోసం ఉద్యమాన్ని సాగించినా, ఒక రకంగా మంచే జరిగింది. కాకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసిఆర్ హైదరాబాద్ బ్రాండ్ పేరుతో సీమాంధ్రుల కాలుకు ముళ్లు గుర్చుకున్నా తన పంటితో తీస్తానంటూ చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలు గాలికి వదిలేశారు. సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఆంద్రా వాళ్లకే ఇచ్చారు. ఆంధ్రాకు చెందిన రియల్ వ్యాపారులను ప్రోత్సహించారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తానని చెప్పుకుంటూ, నగరం చుట్టూ వున్న 3500పైగా వున్న చెరువులలో ఈ పదేళ్ల కాలంలో ఓ వెయ్యి నాశనం చేశారు. అందుకు కేసిఆర్ ప్రభుత్వం సహకరించింది. ధరణి తెచ్చినా, భూములులెక్కలు తేల్చుతానని ప్రగల్భాలు పలికి, చెరువుల ఆక్రమణను ప్రోత్సహించారు. ఇది తెలంగాణ సమాజం సహించలేనిది. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ పల్లె జనాన్ని నమ్మించి, నిరుద్యోగులకు న్యాయం చేయకుండా , ఐటి అంటూ, ఫార్మా అంటూ భూములన మరింతగా దోచిపెట్టాడు. ప్రభుత్వ సంక్షేమ పధకాల కోసమంటూ నగరంలోవున్న ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టి, చెరువులను కూడా అమ్మేశారు. చెరువులను కాపాడే ప్రయత్నం చేయలేదు. నాగార్జున లాంటి వాళ్లు చెరువును ఆక్రమించి, ఎన్ కన్వెన్షన్ పేరుతో కట్టడాలు నిర్మాణం చేశారు. ఉద్యమ కాలంలో ఆక్రమణదారుల భరతం పడతానని చెప్పి మాట తప్పారు. ఆంధ్రా ప్రాంత ప్రజలకు మేలు చేసే పనులు చేశాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న పనులను ప్రజలు హర్షిస్తున్నారు. ఒక్కసారిగా హైడ్రా దూకుడుతో తేలుకుట్టిన దొంగల్లా లోలోన కుమిలిపోతున్నారు. తెలంగాణతోపాటు, హైదరాబాద్‌కు పూర్వవైభవం రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే హైదరాబాద్ చుట్టూ ఆక్రమణకు గురైన చెరువులను స్వాధీనం చేసుకుంటే హైదరాబాద్ ,రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు మంచినీటి కొరత వుండదు. చినుకు పడితే హైదరాబాద్ మునిగిపోయే పరిస్దితి రాదు. చెన్నై, బెంగుళూరు నగరాలలో మంచినీటికోసం విలవిలాడే పరిస్దితి అసలే రాదు.