బంగారం లావాదేవీల్లో బహు జాగ్రత్త సుమా!

`కొనుగోలు సమయంలో జాగ్రత్తలేకపో నష్టపోవడం ఖాయం

`మార్కెట్‌ పోకడలపై అవగాహన అత్యంత అవసరం

`ఆఫర్ల ఆకర్షణ కాదు, నిఖార్సైన అభరణంపై దృష్టిపెట్టండి

`మోసకారులు ఎల్లవేళలా పొంచివుంటారు

`తూకాల్లో మోసం, తక్కువ నాణ్యత ఆభరణాలు అంటకట్టే ప్రమాదం

`ప్రకటనల జోరులో కొట్టుకుపోకండి

`కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో పరిజ్ఞానం పెంచుకోండి

`నేటి మార్కెట్‌ మాయాబజార్‌లో మిమ్మల్ని రక్షించేది అవగాహన మాత్రమే

`జిగేల్‌మనే కాంతి వెనుక పడదోసే మోసం పొంచి వుంటుంది

`ఆకర్షణ కాదు, బంగారం నాణ్యత ముఖ్యం

`తగిన జాగ్రత్తలే మీకు శ్రీరామరక్ష

`లేకపోతే ఊరికే రాని డబ్బు…బూడిదలో పోసిన పన్నీరవుతుంది

`మార్కెటపై అవగాహనతోనే నిఖార్సయిన లావాదేవీలు సాధ్యం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

భారత్‌లో ఉన్న బంగారంపై మోజు మరే ఇతర దేశంలో ఉండదంటే అతిశయోక్తి కాదు. సహ జంగానే మహిళలు బంగారు ఆభరణాలపై మక్కువ పెంచుకోవడం మనదేశంలో సర్వసాధార ణం. పండుగలు, వివాహాది శుభకార్యాల సమయాల్లో బంగారం షాపులు కళకళలాడుతుండటం చూస్తూనే ఉన్నాం. అన్ని లోహాల్లోకి బంగారానికున్న ప్రత్యేకత కారణంగానే దానికంత డిమాండ్‌. డిమాండ్‌ ఎక్కడ ఎక్కువ వుంటుందో మోసం జరిగే అవకాశాలు కూడా అంతే ఎక్కువ వుంటాయన్నది నగ్నసత్యం. కష్టపడి సంపాదించిన సొమ్ము విలువకు తగిన కోరుకున్న బంగారు ఆభర ణం కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులకు కలిగే తృప్తి అంతా ఇంతాకాదు. ఇదే సమయం లో బంగారం పేరుతో తక్కువ నాణ్యత కలిగిన వస్తువులు అంటగట్టినా లేక మోసపూరిత కార్య కలాపాలకు పాల్పడినా, ఊరికే రాని డబ్బు, బూడిదలో పోసిన చందంగా మారుతుంది. అందు వల్లనే బంగారంపై మోజు ఎంతగా వుంటుందో అంతే స్థాయిలో మార్కెట్‌పై అవగాహన కలిగించుకోక పోతే నేటి రోజుల్లో వినియోగదారులు తీవ్రంగా నష్టపోవడం ఖాయం

వెనకటి రోజుల్లో గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ప్రజలు శుభకార్యాలు, పండుగలు, పబ్బాల సమ యంలో తమ సమీపంలోని కంసాలి వృత్తి నిపుణుల వద్ద తమకు కావలసిన వస్తువులు తయారుచేయించుకోవడం జరుగుతుండేది. ఫలితంగా ఎవ్వరూ పెద్దనగరాలవైపు ఎక్కువగా దృష్టిపెట్టేవారు కాదు. కానీ నేడు చేతితో తయారుచేసే నగల స్థానంలో, మెషిన్‌ తయారీ నగలు వివిధ రకాల ఆకర్షణీయమైన డిజైన్లలో అందుబాటులోకి రావడంతో ఒక్కసారిగా జనం నగరాలవైపు చూడటం మొదలుపెట్టారు. ఫలితంగా యాంత్రికత, సంప్రదాయికతను దెబ్బతీసింది. ఈ దెబ్బకు పల్లెలు, పట్టణాల్లో కులవృత్తులు చేసే కంసాలివారు తమ వృత్తులను వదిలేసి వేరే వృత్తులకు మారి పోవడమో లేక నగరాలకు వలసవచ్చి పొట్టకూటికోసం పనిచేస్తుండటమో చేస్తున్నారు. ఫలితం గా పల్లెల్లో ఈ వృత్తి క నుమరుగైపోతున్నది. నగరాల్లో విలాసవంతమైన బంగారు దుకాణాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ పల్లెలో ఈ వృత్తిపై ఆధారపడేవారి సంఖ్య తగ్గిపోతూవస్తోంది.

ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం, విలాసవంతమైన జీవితాలపై మోజు పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలపై మోజు కూడా అదేస్థాయిలో పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో వినియోగ దారుడిగా ఒక షాపులోకి అడుగుపెట్టిన సామాన్యుడికి తాను ఖర్చుచేసిన మొత్తానికి సమాన మైన నాణ్యత కలిగిన ఆభరణం పొందడం అతని హక్కు. మరి అటువంటిది జరుగుతున్నదా? అని ప్రశ్నిస్తే లేదనే సమాధానం వస్తుంది. ఎందుకంటే చేస్తున్న ప్రచారానికి, పొందుతున్న ఆభరణ నాణ్యతకు సంబంధం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ పరిస్థితి ఒకప్పుడు బంగారు ఆభరణాలపై వృత్తి చేసుకునేవారికే పరిమితమైన పరిజ్ఞానం లేదా అవగాహన ఇప్పుడు వినియోగదారుడు కూడా కలిగివుండాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడిరది. లేకపోతే నకిలీ మాయలో పడి కష్టార్జితాన్ని కల్పోక తప్పదు. మార్కెట్‌ మాయాజాలం పెద్ద ఉప్పెనలా ముంచేస్తున్న నేటి కాలంలో వినియోగదారుడు తనను తాను కాపాడుకోవడానికి అవగాహన ఒక్కటే మార్గం.

ఈ మాయాజాలం అన్ని రంగాలకు విస్తరించినప్పటికీ, బంగారానికి ప్రత్యేకం. అన్ని వర్గాల ప్రజలను తన ఆకర్షణ మాయలో కట్టిపడేసే ఉత్కృష్ట లక్షణం బంగారానికే సొంతం. ఈ నేపథ్యంలో బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఇందులో జరిగే మోసాలు, వాటినుంచి బయటపడే మార్గాల గురించి తెలుసుకోవడం వినియోగదారులకు చాలా అవసరం.

విపరీతమైన డిమాండ్‌ నేపథ్యంలో బంగారం లావాదేవీల్లో మోసాలు కూడా సహజమే. ఒక వ్యాపారంపై పెట్టుబడి పెట్టేముందు వ్యాపారి దానిపై ఎంతగా అధ్యయనం చేస్తాడో మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలన్నా లేక అమ్మాలన్నా మార్కెట్‌ అధ్యయనం చే యడం తప్పనిసరి. అప్పుడు మాత్రమే ఒక వినియోగదారుడు తాను జరిపిన లావాదేవీకి అనుగుణమైన బంగారు ఆభరణాన్ని పొందడమో లేక అమ్మిన బంగారానికి తగిన సొమ్ము పొందడమో సాధ్యమవుతుంది.

వినియోగదారుడు నకిలీ ఆభరణాల విషయంలో జాగరూకుడై వుండాలి. ఇప్పుడు స్కాంలకు పాల్పడేవారు నకిలీ కాయిన్లు, ఖడ్డీలు, ఆభరణాలు తయారుచేస్తున్నారు. ఇవి అచ్చం నిజమైన బం గారు ఆభరణాలుగానే కనిపిస్తాయి. కొన్ని ప్రత్యేక పరీక్షలు చేస్తే తప్ప సాధారణంగా వీటిని నకి లీవిగా గుర్తించడం కష్టం. నకిలీ సామ్రాజ్యం ఆ స్థాయిలో విస్తరించింది మరి! ఈ నేపథ్యంలో వినియోగదారుడు తాను కొనుగోలు చేసిన ఆభరణం లేదా బంగారానికి సంబంధించి ధృవపత్రా లు లేదా అది నిజమైన బంగారమని వెల్లడిరచే రుజువులను చూపమని షాపు యజమానిని అడగాలి. దీనివల్ల భవిష్యత్తులో మీరు ఇదే బంగారు ఆభరణాలతో లావాదేవీలు జరిపినప్పుడు ఈ పత్రాలు ఉపయోగపడతాయి.

‘బెయిట్‌ అండ్‌ స్విచ్‌’ అనే మోసానికి స్కామర్లు పాల్పడుతుంటారు. అంటే మీకు చూపేటప్పుడు నిజమైన బంగారు ఆభరణాన్ని చూపి, మీరు దాని కొనుగోలుకు నిర్ణయించుకున్నాక, తక్కువ నాణ్యత కలిగిన సరిగ్గా అటువంటి ఆభరణాన్నే మీకు అంటగట్టడం చేస్తారు. లావాదేవీ ప్రారంభమైన దగ్గరినుంచి చివరివరకు ఎంతా జాగ్రత్తగా వ్యవహరించడమే దీనికి పరిష్కారమార్గం. మరో రకమైన మోసంలో, తూనిక పరికరాల్లో మార్పులు చేయడం ద్వారా తక్కువ పరిమాణంలో బంగారాన్ని మీకు అమ్మజూపుతారు. ఇక్కడ మీరు చెల్లించే మొత్తానికి సరైన పరిమాణంలో బంగారం లభిచక మీరు నష్టపోతారు.

బంగారం అమ్మకాల్లో కనిపించే మరో సాధారణ మోసాన్ని ‘లో బాల్‌ ఆఫర్స్‌’ అంటారు. మీవద్దనున్న బంగారాన్ని అమ్మడంకోసం షాపుకు వెళ్లినప్పుడు, మార్కెట్‌ ధరకంటే తక్కువ ధరనే ఆఫర్‌ చేయడం ఈ తరహా మోసం కిందికి వస్తుంది. అటువంటప్పుడు దుకాణానికి వెళ్లడానికి ముందే మీరు మార్కెట్‌ ధరపై సరిjైున అవగాహన ఏర్పరచుకొనివుంటే, ఈ మోసం బారి నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా మీవద్ద ఉన్న పాత బంగారాన్ని అమ్మడానికి వెళ్లినప్పుడు, కొందరు అ ప్రైజర్లు వాటికి తక్కువ విలువ చూపుతారు. దీనివల్ల అసలైన ధర రాక నష్టపోతారు. అందువల్ల అధీకృత అప్రైజర్ల వద్దమాత్రమే బంగారం విలువను నిర్ధారింపజేయాలి.

కొన్ని సందర్భాల్లో బంగారం కొనుగోలుదార్లు ప్రకటనల ద్వారా ఆఫర్లు ప్రకటిస్తారు. దీన్ని చూసిమీరు దుకాణానికి వెళితే, తరుగులు, కమిషన్లు మరికొన్ని కోతల పేరుతో మీకు రావలసిన అస లు ధరలో చాలావరకు కోతపడుతుంది. అంటే మీ బంగారానికి రావలసిన ధరకంటే చాలా త క్కువ ధరను మాత్రమే పొందుతారు. మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వ నిర్ధారిత ప్రామాణీకృత తూకాల లెక్కలను బంగారం మూల్యాంకనంలో ఉపయోగించకుండా, వేరే విధానాలను అనుసరిస్తుంటారు. దీనివల్ల మీరు బంగారం నష్టపోయే ప్రమాదం ఉంది.

మరికొన్ని సందర్భాల్లో కొందరు తాము ఎంతో నిఖార్సయిన వ్యాపారులమని చెప్పుకునేందుకు ధృవపత్రాలు ఇతరత్రా అంశాలను ఆధారంగా చూపడానికి యత్నిస్తారు. ఆవిధంగా నకిలీ ధ్రువ పత్రాలను చూపి తాము విశ్వసనీయ వ్యాపారులుగా వినియోగదారులను నమ్మించడానికి చూ స్తారు. ఇందుకోసం నకిలీ పేర్లను ఉపయోగించడానికి కూడా వారు వెనుకాడరు. ఇటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు.

పెరుగుతున్న డిమాండ్లతో పాటు మోసాలు కూడా అదేస్థాయిలో విస్తరిస్తున్న నేపథ్యంలో వినియోగదార్లు తమను తాము రక్షించుకోవాలంటే ‘అవగాహన’ అనే కవచాన్ని ధరించక తప్పదు. ఇది మాత్రమే మిమ్మల్ని మోసమనే ‘వైతరిణీ నది’ ని దాటిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *