ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేసిన రెడ్ క్రాస్ మెడికేర్ యూనిట్

పరకాల నేటిధాత్రి
రెడ్ క్రాస్ హనుమకొండ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,హనుమకొండ మొబైల్ మెడికేర్ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ జిల్లా దామెర మండలంలోని లాదెళ్ల గ్రామంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం లో వృద్దులకు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం 60 సంవత్సరాలు పైబడిన వయోవృద్దలకు ఉచిత సంచార వాహన వైద్య సేవల ఆరోగ్య శిబిరం హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్ రెడ్డి,వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్,కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డిల ఆదేశానుసారం ఏర్పాటు చేసి బిపి.షుగర్ రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించటం జరిగింది.ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటిస్,సీనియర్ సిటిజన్స్,భారత ప్రభుత్వ సహాకారంతో 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు ఇంటి వద్దనే సేవలనందించేందుకు హనుమకొండ రెడ్ క్రాస్ సంచార వైద్యశాల సేవలు అందిచడం జరుగుతుందని, ప్రతి నెల మీ గ్రామానికి వచ్చి క్యాంపు నిర్వహించి వృద్ధులకు బిపి. షుగర్ రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించటం జరుగుతుందని,ఇలాంటి వైద్య శిబిరాలను గ్రామాలలోని వృద్ధులంతా సద్వినియోగం చేసుకోవాలని పాలకవర్గం తెలిపారు.ఈ ఆరోగ్య శిబిరంలో రెడ్ క్రాస్ డాక్టర్లు కిషన్ రావు,డాక్టర్ మదన్ మోహన్ రావు,రెడ్ క్రాస్ సిబ్బంది గుల్లెపెల్లి శివకుమార్,గంగాధర్,అనిల్, కె. రమేష్,పోశాలు,శ్రీకాంత్, సుమంత్,గ్రామస్తులు మరియు వృద్దులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *