Illegal Quarrying Sparks Protest in Shayampet
గుట్టలు గుల్ల… సర్కార్ లీజు గోరంత..తవ్వుకునేది గుట్టంతా
అక్రమ క్వారీ నిర్వాహకుల జేబుల్లోకి వెళుతున్నాయి
కొత్తవి ఏర్పాటు చెయొద్దు అంటూ కరపత్రాలతో గ్రామ ప్రజలు అందోళన
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం పత్తి పాక గ్రామ శివారులో గత పది ఏళ్ల నుండి శ్రీ వెంకటేశ్వర క్రషర్ క్వారీ ఏర్పాటు చేశారు. ఈ క్రషర్ వల్ల పత్తిపాక చుట్టూ గ్రామాలలో ఉన్న ప్రజలు అనా రోగ్యపాలవుతూ కుటుంబం లో చిన్నపిల్లలు వృద్ధులు, శ్వా స కోశ వ్యాధులతో కుటుం బంలో తీవ్ర నష్టం కలుగుతుం దని గ్రామపంచాయతీ పాల కవర్గం, గ్రామ ప్రజలు ఏకతా టికివచ్చి ఈ క్రషర్ వల్ల కలిగే నష్టాలను గత ప్రభుత్వానికి, మరియు అధికారులకు, జిల్లా కలెక్టర్లకు మైనింగ్ అధికారు లకు,తెలియజేస్తూ వినతి పత్రాలు అందజేసిన రోజులు ఉన్నాయి. అయినా ఏ ప్రభు త్వం వచ్చినా అధికారులు వచ్చిన,మాకు జరిగే నష్టాల వల్ల అనేక తీవ్ర అక్రోసానికి గురయ్యామని అన్నారు.
క్రషర్ క్వారీపై నిబంధన ఉల్లంఘించిన మైనింగ్ అధికారులు
మైనింగ్అధికారులు క్వారీల వైపు సీరియస్ గా చూసినా దాఖలాలు కనిపించడం లేదు. దీంతో కంకర క్వారీల నిర్వా హకులు యథేచ్ఛగా నిబంధ నలు ఉల్లంఘిస్తున్నారు. చా లా చోట్ల అనుమతులు లేని చోట, అసైన్డ్ భూముల్లో క్వారీ లు నిర్వహిస్తున్నారని విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ ఎత్తున కంకర కోసం తవ్విన గుంతలను అలాగే వదిలేయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యంత్రాలతో పంట పొలాలపై దుమ్ము పడటం, పేలుళ్ల శబ్ధం తో ఇళ్లకు బీటలు వారుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు
అధికారులు పట్టించు కోవడం లేదు
పలుమార్లు స్థానికులు అధికా రులకు ఫిర్యాదు చేసిన పట్టిం చుకోవడం లేదన్నారు. అధి కారుల తీరుపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక శాయంపేట మండలం పత్తిపాక గ్రామ శివారులో సైతం కంకర క్వారీలు విచ్చల విడిగా నడుస్తున్నాయి. పంట లు దెబ్బ తింటున్నాయని రైతులు అభ్యంతరాలను నిర్వాహకులు, అధికారులు లెక్క చేయడం లేదు. ఈ ప్రాంతంలో భారీ లారీల్లో కంకర తరలింపు వల్ల రహదా రులన్నీ గుంతల మయంగా మారి ఛిద్రమవుతోంది. ఈ కార్యక్రమంలో పత్తిపాక గ్రామ ప్రజలు, నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
