అన్నదాతల అభివృద్ధి కాంగ్రెస్ పాలన లక్ష్యంకాంగ్రెస్ పార్టీమండల అధ్యక్షులు..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లిమండలంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ ఎల్ ఎం.4. ఏ ఎల్ ఎం.5. కాలువల ద్వారా సాగునీరు అందిస్తున్న విధానాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమమే ప్రజాపాలన లక్ష్యమని తెలియజేస్తూ జిల్లెల్ల గ్రామ చెరువులోకి వచ్చే సాగునీటి కాలువలను మరియు దాచారం మీదిగా చిన్న లింగాపూర్ పరిసర గ్రామాలకు వచ్చే కాలువలను రైతులతో కలిసి సందర్శించి రైతులకు సాగునీరు రావడానికి కృషిచేసిన సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి ప్రభుత్వ విప్ విఫ్ వేములవాడ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కి. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వం పెల్లి సత్యనారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు.11/6. ఏ ఎల్ ఎం కాల్వ ద్వారా శాశ్వత పరిష్కారం ద్వారా లక్ష్మీపురం గ్రామ0 వరకు నిర్మాణం పూర్తి చేసి అన్నదాతలకు అండగా ఉండేందుకు ప్రభుత్వ పెద్దలు కృషి చేస్తున్నారని కాల్వ నిర్మాణం కోసం ల్యాండ్ ఆక్వా జేషన్ లో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందించే దిశగా కేకే మహేందర్ రెడ్డి కృషి చేస్తున్నారని తమ గ్రామాలకు సాగునీరు రావాలని రాత్రింబవళ్లు.కష్టపడి కేసుల పాలైన వివిధ గ్రామాల రైతులకు అండగా ఉంటామని ప్రజాపాలనలో అన్నదాతలు బాధపడితే చూస్తూ ఊరుకోం అని వారికి అన్ని విధాల అండగా ఉండి ఆదుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ అధ్యక్షులు డైరెక్టర్లు మండల కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ నాయకులు తో పాటు జిల్లా చిన్న లింగాపురం రైతులు తదితరులు పాల్గొన్నారు