– కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంతకంతో రైతులకు రుణమాఫీ
– గత ప్రభుత్వంలో ఎటువంటి లైసెన్సులు లేకుండా అనుమతులు
– సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి పార్టీ అని రైతులకు ఎటువంటి ఇబ్బందులు జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు.
పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అనే ఒక గొప్ప సదుద్దేశంతో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకే ఒక పెన్ను సంతకంతో రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పాడి రైతుల విషయంలో ఎన్నో హామీలు ఇచ్చినా కూడా ఒకటి కూడా నెరవేర్చలేదని, కొన్ని పాడి పరిశ్రమ సంస్థలకు వ్యవస్థలకు ఎటువంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఫైర్ సేఫ్టీ లేకుండా గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని ఒకవేళ ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దాని బాధ్యత ఎవరు అని అందుకోసమే దీనిని గమనించిన అధికారులు అధికార యంత్రాంగము ఇటువంటి సమస్యల పైన చర్యలు తీసుకుంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. చట్టాలను చుట్టాలుగా మార్చుకొని లబ్ధి పొందాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకోదని అన్నారు. సమాజానికి ఆమోదయోగ్యమైనటువంటి వ్యాపారం చేసే సంస్థలకు వ్యవస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అందుకోసమే గత ప్రభుత్వం ఎటువంటి లైసెన్సులు లేకుండా అనుమతులు ఇస్తే అధికారులు వాటిని సీజ్ చేసినా కూడా రైతులు ఇబ్బంది పడద్దని ఒక ఉద్దేశంతో వాటిని మళ్లీ తెరిపించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ సిరిసిల్ల పట్టణ మహిళా అధ్యక్షులు వెలుముల స్వరూప,జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, ఆడెపు చంద్రకళ, గోనె ఎల్లప్ప, కత్తెర దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పక్షపాతి పార్టీ
