జాతీయస్థాయి బహుభాష కవి సమ్మేళనంలో డాక్టర్ దూడపాక రమేష్ సన్మానం
.
మొగుళ్లపల్లి నేటి ధాత్రి
తెలంగాణ ప్రభుత్వం భాషా సాంసృతిక శాఖ మరియు వరల్డ్ ఫిస్ ఫెస్టివల్ సొసైటీ వరంగల్ UNO వారు ప్రకటించిన ప్రపంచ కవిత దినోత్సవం 2026 వారి ఆధ్వర్యంలో జాతీయస్థాయి బహుభాషా కవి సమ్మేళన కార్యక్రమాల్ని హనుమకొండ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దూడపాక రమేష్ పాల్గొని ప్రపంచ కవితా స్వరాలు ప్రజా ఐక్యత రాగాలు అనే అంశంపై తన కవిత గానాన్ని వినిపించినందుకు ప్రశంస పత్రం శాల్వతో గౌరవంగా సన్మానించారు. గత సంవత్సరం మార్చి 22 ప్రపంచ కవిత దినోత్సవం 2025 లో జరిగిన కార్యక్రమంలో జాతీయస్థాయి ప్రథమ బహుమతి పొందానని గుర్తు చేసుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే మొదటి స్థాయి బహుమతి అందుకోవడం జీవితంలో మరుపురాని అనుభూతిగా పేర్కొంటూ ఈ సంస్థ నన్ను కవిగా నా ప్రతిభను గుర్తించి పునర్జన్మ ఇచ్చిన తల్లి లాంటి సంస్థ అని పేర్కొన్నారు. వెనువెంటనే వివిధ రాష్ట్రస్థాయి వేదికలపై అవకాశాలు రావడం ఒక సంవత్సరం తిరిగే లోపు గౌరవ డాక్టరేట్ గోవా వారు ప్రధానం చేయడం గర్వంగా ఉందని ఇట్టి విషయాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమంలో మళ్లీ పాల్గొన్నానని పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమాలు వివిధ రాష్ట్రాల నుంచే వివిధ దేశాలల్లో ఉన్న కవులు వారి యొక్క ఆడియో వీడియో ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనడం జరిగింది. వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ సిరాజుద్దీన్ సంస్థ అధ్యక్షులు సురేష్ లాల్ ముఖ్య అతిథి ఏసిపి విజయ్ కుమార్, బీటావరం శ్రీమన్నారాయణ, నల్ల లక్ష్మీనారాయణ, ఆచార్య రవికుమార్, అడ్వకేట్ రవికుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.
