పరకాల నుండి వేములవాడకు 2ప్రత్యేక బస్సులు
డిపో మేనేజర్ జి.రాంప్రసాద్
పరకాల,నేటిధాత్రి
పరకాల బస్టాండ్ నుండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం రెండు ఎక్ష్ప్రెస్స్ బస్సులను ప్రారంభిస్తున్నట్టు డిపో మేనేజర్ రాంప్రసాద్ ఓ ప్రకటన లో తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సర్వీసులు 4జనవరి ఆదివారం నుండి అందుబాటులో ఉండనున్నట్టు తెలిపారు.బస్సులు బయలుదేరు సమయం ఉదయం 7:30 మరియు 9గంటలకు తిరిగి మధ్యాహ్నం 2:45 నిమిషాలకు మరియు 4గంటలకు అందుబాటులో ఉంటాయని ఈ అవకాశాన్ని పట్టణ మరియు పరిసర ప్రాంత (భక్తులు)ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
