ఉప్పల్ ప్రైస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించిన హరిహర…

ఉప్పల్ ప్రైస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించిన హరిహర క్షేత్రం శ్రీ చిలుకశ్వేర అంజనేయు స్వామి దేవాలయం కమిటీ

ఉప్పల్ నేటిధాత్రి

 

ఉప్పల్ ప్రైస్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన రమా కిషోర్ ని మరియు కమిటీ సభ్యులను ఆలయకమిటీ అధ్యక్షులు దాసరి కృష్ణ ప్రధాన కార్యదర్శి గోనె శ్రీకాంత్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పల్ సర్కిల్ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర ఎంతైనా ఉందని సమాజంలో జరిగే అని విషయాలను ప్రజలకు తెలియజేస్తూ.. అభివృద్ధి మరియు సమస్యలను ఎత్తి చూపుతూ ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే భాధ్యతను వారు నిర్వహిస్తారని అన్నారు. చిల్కానగర్ శివాలయం పున్నరునిర్మాణంలో కూడా పాత్రికేయు సోదరుల సహాయ సహకారాలు ఉండాలని ఆలయకమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉప్పల్ ప్రైస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మరియు ఆలయకమిటీ సభ్యులు జెల్లీ మోహన్, గోనె అంజయ్య, గోపాల్ రెడ్డి, కావాలి నర్సింహ్మ, మాస శేఖర్, పైడిపాల గౌరయ్య, దండు అంజయ్య, పోలోజు శ్రీనివాస్ చారి, రుద్రరపు శంకర్, మాడుగుల శ్రీనివాస్ యాదవ్, కాసుల రామకృష్ణ, మల్లేష్ ముదిరాజ్, నాని ముదిరాజ్, పాల్గొన్నారు.

ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడుగా వడ్డేపల్లి కిషోర్…

ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడుగా వడ్డేపల్లి కిషోర్

ఉప్పల్ నేటిధాత్రి

 

ఉప్పల్ ప్రెస్ క్లబ్ ( ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ) నూతన అధ్యక్షుడు గా వడ్డేపల్లి కిషోర్ ఎన్నికయ్యారు . ఉప్పల్ లో సీనియర్ జర్నలిస్టులు కడారి బాలేశం , చంద్రమౌళి ల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . నూతన అధ్యక్షుడుగా వడ్డేపల్లి కిషోర్ , ప్రధాన కార్యదర్శి లుగా ఆనంద నర్సింహరెడ్డి , పెంబళ్ల కుమార్ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌గా కొలనుపాక చంద్రమౌళి , సలహదారులుగా కడారి బాలేశం , మాటూరి శ్రీనివాస్ , మచ్చ శ్రీహరి , కంచు శ్రీనివాస్ , డి సురేష్ , పారెల్లి సాగర్ గౌరవాధ్యక్షులుగా ఓంకారం సంతోష్ రాజు , వర్కింగ్ ప్రెసిడెంట్ గా పయ్యావుల సంతోష్ , డిప్యూటి జనరల్ సెక్రటరీగా సీసా నాగరాజు , ఉపాధ్యక్షులుగా బోడ ప్రవీణ్ , కందుకూరి ప్రశాంత్ , గోరుకంటి నరేందర్ , బొంతు స్టాలిన్ , కోశాధికారులు గా ఆర్ . యాదగిరి , సారా వెంకటేష్ గౌడ్ , ఆర్గనైజింగ్ కార్యదర్శి లుగా పి.తిరుమల్ రెడ్డి , కొయ్యేడి కరుణాకర్ , ఎడపాక సురేష్ , దొడ్డి శోభన్ , శ్రవణ్ , జాయింట్ సెక్రటరీ లుగా దత్రపు దేవా , బల్ల సూర్యం , ప్రవీణ్ , కె. జీవన్ గౌడ్ సాంస్కృతిక కార్యదర్శి లుగా పబ్బు కిరణ్ , ఉపేందర్ , షేక్ పాషా , ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా బి.వి.రాజు , విష్ణు , లక్ష్మణ్ , వెంకట్ రెడ్డి , సోనిశ్రీ , ప్రసాద్ , చంద్రశేఖర్ , అరుణ్ , శ్రీకాంత్ , శ్రీధర్ , సిద్దు , జి.వెంకటేష్ , సి.చరేష్ , డి.శివ తదితరులు ఎన్నికయ్యారు . ఈ సందర్భంగా అధ్యక్షుడు గా వడ్డేపల్లి కిషోర్ మాట్లాడుతూ … ఉప్పల్ నియోజకవర్గంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమస్యల పరిష్కారం, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యలను నిస్పాక్షికంగా వెలుగులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే, యువ జర్నలిస్టులకు మార్గదర్శకత్వం అందిస్తూ మీడియా వృత్తికి గౌరవం తీసుకొచ్చేలా నూతన కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ నూతన కమిటీ ఏర్పాటుతో ఉప్పల్ మీడియా వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొందని, జర్నలిజం మరింత బలంగా ముందుకు సాగుతుందని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభినందనలు తెలిపారు .

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version