వాలి బాల్ టోర్నమెంట్ ఈ నెల 14 వ తారికు నుండి ప్రారంభం
జహీరాబాద్ నేటి ధాత్రి:
శ్రీజహీరాబాద్ నియోజకవర్గ ము, కోహిర్ మండల్ ,పోతిరెడ్డిపల్లి గ్రామంలో వాలి బాల్ టోర్నమెంట్ ఈ నెల 14 వ తారికు నుండి ప్రారంభించనున్నారు.గత 15 సంవత్సరాల నుండి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రు.ఈ టోర్నమెంట్ గ్రామం లో నిర్వాహకులు ఇప్పటికే వాలి బాల్ కోట్ ను సిద్ధం చేశారు.ఈ సందర్భంగా నిర్వాహకుడు జాకీర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి , శారీరిక పరిపక్వత కోసం, దోహదం చేస్తాయి అన్నారు. ఈ వాలీ బాల్ టోర్నమెంట్ కు పోతిరెడ్డిపల్లి గ్రామ ఉప సర్పంచ్ వారసుడు నర్సిములు యాదవ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ టోర్నమెంట్ లో దాదాపు 15 టీం లు వివిధ ప్రాంతాల నుండి పాల్గొంటున్నారు. ఈ వాలి బాల్ టోర్నమెంట్ ప్రారంభించడానికి జహీరాబాద్ డి యస్ పి సైదా నాయక్ ను నిర్వాహకులు ఆహ్వానం అందించారు. నిర్వాకులు శ్రీనివాస్ రెడ్డి, జాకీర్ ,సలీమ్, ప్రభాకర్, మొయిజ్, విష్ణువర్ధన్,శ్రీకాంత్ చిట్టి, శ్రీకాంత్, అసద్,రహీం,వహిద్ తదితరులు ఉన్నారు.
