గణపతి ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టోర్నమెంట్ ప్రారంభం
టోర్నమెంట్ను ప్రారంభించిన సిఐ క్రాంతి కుమార్
పరకాల,నేటిధాత్రి
గణపతి ఫ్రెండ్స్ షటిల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్ ను పరకాల సీఐ క్రాంతి కుమార్ ప్రారంభించారు.ఈ టోర్నమెంట్లో విజేతలుగా మొదటి బహుమతి బండారి గిరిప్రసాద్,మునావత్ రమేష్ గెలుపొందడం జరిగింది.రెండవ బహుమతి మారపెల్లి రణధీర్,మద్దెల దామోదర్,45 ప్లెస్ విభాగంలో మొదటి బహుమతి సుధమల్ల అనిల్ కుమార్,దామోదర్,రెండవ బహుమతి రాజు,ఆజాద్ వీరికి బహుమతులు గణపతి ఫ్రెండ్స్ షటిల్ క్లబ్ సభ్యులు అందజేశారు.వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులకు క్లబ్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులు అజ్జు, బాలకృష్ణ,నాగరాజ్,
సాయికృష్ణ,వెంకన్న,
దేవేందర్,ప్రకాష్,సాయి, చందు,బంటి,వర్ధన్,అశోక్,
సురేష్,మార్కండేయ,శ్రీధర్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.
