సమన్వయంతో మహా శివరాత్రి మహోత్సవములు విజయవంతం చేయాలి…

సమన్వయంతో మహా శివరాత్రి మహోత్సవములు విజయవంతం చేయాలి.

#ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించాలి.

#ఈ నెల 15 నుంచి 17 వరకు జాతర నిర్వహణ.

#భక్తుల నుంచి ఫిర్యాదు రాకుండా ఏర్పాట్లు చేయాలి

#జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు, నేటిధాత్రి:

 

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో మహా శివరాత్రి మహోత్సవములు విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ రెవిన్యూ సి. హెచ్. మహేందర్ జి,
ఆర్డీఓ వెంకటేష్, రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఈవో లతో కలిసి ఆయా శాఖల అధికారులతో జాతర సమన్వయ సమావేశం నిర్వహించారు.
మహా శివరాత్రి జాతర సందర్భంగా పారిశుద్ధ్యం, పార్కింగ్, రోడ్డు నిర్వహణ, దేవాలయం వద్ద వసతి సౌకర్యం, త్రాగునీటి సరఫరా, హెల్త్ క్యాంప్ ల ఏర్పాటు, ఫైర్ ఇంజన్ సౌకర్యం, హెల్ప్ సెంటర్ ఏర్పాటు సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాల పై సంబంధిత శాఖ అధికారులు సిద్ధం చేసుకున్న ప్రణాళికను వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు మహా శివరాత్రి మహోత్సవ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
జాతర కు వచ్చే భక్తుల సంఖ్య దృష్ట్యా పటిష్ట భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు.
పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని, రోడ్డుకు ఇరు వైపులా పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
భక్తుల కోసం అవసరమైన మేర పందిర్లు ఏర్పాటు చేయాలని అన్నారు.
జాతర సందర్భంగా వచ్చే భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ చలి వేంద్రాలను, చలువ పందిరిలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆలయ పరిసరాలలో అపరిశుభ్రత కాకుండా పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.
జాతర సందర్భంగా వైద్య క్యాంపులు ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యమైన ప్రదేశాలలో అన్ని పందిళ్ళ వద్ద మంటలు ఆర్పే ఫైర్ యంత్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

కోట గుళ్ళు శివరాత్రి మహోత్సవాలకు అంకురార్పణ…

కోట గుళ్ళు శివరాత్రి మహోత్సవాలకు అంకురార్పణ

ఆలయ పోషకులకు
కళ్యాణ పత్రిక అందజేత

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో
ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో ఈనెల 15 ఆదివారం నుండి, 17 మంగళవారం , వరకు మూడు రోజులపాటు నిర్వహించే శివరాత్రి మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది. సోమవారం ఆలయ పోషకులు లలిత నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ రాజేశ్వరప్రసాద్ లలిత దేవి దంపతులు, డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులకు కళ్యాణ పత్రికను కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అలయ అర్చకులు బూరుగుపల్లి మఠం గంగాధర్, జూలపల్లి నాగరాజు లు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పోషకులకు ఆశీర్వచనాలు అందజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version