ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.

కోదాడ, నేటి ధాత్రి:

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల జంట కార్యాచరణ సమితి (టి జి ఈ జె ఏ సి) కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం కోదాడ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ఎదుట టీఎన్జీవో అధ్యక్షుడు గడ్డం చిరంజీవి ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 2వ పీఆర్సీ ని తక్షణమే అమలు చేయాలని, సిపిఎస్ స్కీమ్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేసి ఉద్యోగులకు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం కోసం హెల్త్ కార్డులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల అధ్యక్ష,కార్యదర్శులు గడ్డం చిరంజీవి, తీగల నరేష్, రావెళ్ల సీతారామయ్య, వేనేపల్లి శ్రీనివాసరావు, బంధం వెంకటేశ్వర్లు, ఆర్సి రెడ్డి,రామ నరసయ్య, బడుగుల సైదులు, పాండురంగాచారి, అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version