అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం రైతు వేదికలో అంగన్వాడి కేంద్రాల్లో డిజిటల్ సేవలను మరింత బలోపేతం చేయడంలో 54 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు అంగన్వాడి కేంద్రాల అభివృ ద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉం ది, సరైన పోషణ – ఆరోగ్య తెలంగాణ లక్ష్యం అన్నారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యో తి ప్రజ్వలన చేసి ప్రారంభిం చారు .
మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.ఎమ్మెల్యే మా ట్లాడుతూరాష్ట్రంలోని అన్ని అంగన్వాడి కేంద్రాలను అభి వృద్ధి చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది అంగన్వాడి టీచర్లకు స్మార్ట్‌ఫో న్ల పంపిణీ ద్వారా సేవల నాణ్యత మరింత మెరుగ వుతుంది గర్భిణీలు,బాలిం తలు, చిన్నారుల ఆరోగ్య వివరాలను డిజిటల్ విధా నంలో నమోదు చేయడం సులభతరం అవుతుందని, గతంలో 16 రిజిస్టర్లలో నమో దు చేయాల్సిన పనిని ఇప్పు డు సాంకేతికత ద్వారా సుల భతరం చేసినట్లు తెలిపారు.
పోషణ పక్వాడ కార్య క్రమం ద్వారా 15 రోజుల పాటు పౌష్టికాహారంపై అవగాహన కల్పించడంతో పాటు, గర్భి ణీలు, బాలింతలు,చిన్నారుల ఆరోగ్య స్థితిగతులను పర్యవే క్షించను న్నట్లు చెప్పారు.ప్రతి నెల మొదటి వారంలో పిల్లల ఎత్తు, బరువులను కొలిచి డిజిటల్ యాప్స్‌లో నమోదు చేస్తే పోషణ లోపాలను త్వరగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడిటీచర్లు,వ్యవసాయశాఖ అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీనాయకులు,పాల్గొన్నారు.
