బేడ బుడగ జంగాలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి…

బేడ బుడగ జంగాలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి

రాష్ట్ర అధ్యక్షుడు సిరుపాటి వేణు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలో చల్లగరిగే, చిట్యాల నైన్ పాక గ్రామాలలో గత 40 సం॥రాల నుండి మా బేడ బుడగ జంగం కులానికి సంబంధించిన వారు నివసిస్తున్నారు. వీరు 1950లోనే ఎస్.సి.లు గుర్తించబడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన యస్.సి. వర్గీకరణలో భాగంగా గ్రూపు-1లో క్ర.సం. 2లో బేడ బుడగ జంగం కులానికి చెందిన వారిని పొందుపర్చినారు. బెడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు అదనపు కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణాలో వివిధ జిల్లాలలో, వివిధ మండలాలలో వేరే కులానికి సంబంధించిన ఎస్.సి.లుగా కాకుండా వీరు వేరే కులానికి చెందిన వారని తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. ఇందుకు ఉదాహరణకు చిట్యాల, చల్లగరిగే, నైన్ పాక గ్రామంలో నివసిస్తున్నారు మీరు పై తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. అధికారులు మాకు సహకరించడం లేదు. విద్య పరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయంగా ఆర్థికంగా ఏ రంగంలోనైన ఎదుగాలంటే కుల ధృవీకరణ పత్రం బేడ (బుడగ) జంగం గ్రూపు-1 క్ర.సంఖ్య 2 కుల ధృవీకరణ పత్రాలు మంజూరి చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నాం మా బేడ (బుడగ) జంగాల కులాని సంబంధించిన కొన్ని ఇంటి పేర్లు మీకు తెలియపరుస్తున్నాను. 1) పురాణం, 2) గంధం, 3) తూర్పాటి, 4) చిత్తారి, 5) మోటం, 6) బొమ్మల,
8 ) చేర్ల, 9) టేకు 10 కొండపల్లి, మొదలగు ఇంటిపేర్లు ఉన్నాయని వారు అన్నారు ఈ కార్యక్రమంలో
చీరల చందు
చేర్ల చందు
పురాణం సారయ్య
పురాణం లింగమూర్తి
చిత్తార్ సమ్మయ్య
పురాణం సంపత్
సిత్తారి వెంకటస్వామి
చిత్తారి తిరుపతి
పురాణం ప్రభాకర్
పురాణం నాగరాజు
పురాణం లక్ష్మణ్
తోర్పాటి మోహన్ ప్రజా జ్యోతి తదితరులు పాల్గొన్నారు

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం

మానవత్వాన్ని చాటుకున్న మహిళ
మొగుళ్లపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన నిర్వహిస్తున్న జాతరలో జమ్మికుంటకు చెందిన ఒక మహిళ పర్స్ తో పాటు 5 వేల రూపాయలను పోగొట్టుకుంది. పోగొట్టుకున్న పర్సు మరో మహిళకు దొరికింది. దీంతో ఆ మహిళ దొరికిన పర్సు తో పాటు 5 వేల రూపాయలను జాతర ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి చదువు అన్నారెడ్డికి అప్పగించింది. దొరికిన పర్స్ తో పాటు 5 వేల రూపాయలను అప్పగించి మానవత్వాన్ని చాటుకున్న ఆ మహిళను మొగుళ్ళపల్లి ఎస్ఐ బోరగాల అశోక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో చదువు జయపాల్ రెడ్డి, చదువు మహిపాల్ రెడ్డి, వడ్జే ఆనంద్ రావు, జాతర ఉత్సవ కమిటీ సభ్యులు మల్సాని నర్సింగరావు, బండారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

సిబ్బందిని అకారణంగా తొలగించవద్దని డీపీవోకు వినతి

సిబ్బందిని అకారణంగా తొలగించద్దని డీ పి వో కు వినతి పత్రంఅందజేత.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

మంగళవారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి కి జిల్లా లో ని గ్రామ పంచాయతీ లలో పనిచేస్తున్న సిబ్బంది ని ఆకరణంగా తొలగించవద్దని జిల్లా పంచాయతీ అధికారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందుకు మేడం సానుకూలంగా స్పందించి ఆకరణంగా తొలగించవద్దని సర్క్యులర్ ఇప్పిస్తానని తెలడం జరిగింది ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంగం నాయకులు అనుసునూరి రాజావీరు, ముస్కె రమేష్, జాలిగాపు శ్రీకాంత్, కొత్త కొండ తిరుపతి, కంచెర్ల శంకర్, అంకం సదానందం, బాబు,జివి రావు, చిట్యాల శశి, దేవేందర్ పాల్గొన్నారు.

ఎస్సీ హాస్టల్ వార్డెన్ భవాని సస్పెండ్

ఎస్సీ హాస్టల్ వార్డెన్ భవాని సస్పెండ్

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు కృతజ్ఞతలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక ఏఎన్టిసి కార్యాలయంలో ఎస్ఎంహెచ్ఎస్సి హాస్టల్ వార్డెన్ భవాని విద్యార్థినిపై అకారణంగా చితకబాధిందని తెలియడంతో ఎన్ఎస్ యు ఐ నాయకులమైన మేము తెలియడంతో వెంటనే స్పందించి వారు సంబంధిత అధికారైన ఎస్. సి. డ. బ్ల్యూ. ఒ ఇంచార్జ్ ఇంద్ర కి తక్షణమే కాల్ చేసి అకారణంగా చితకబాదినటువంటి హాస్టల్ వార్డెన్ భవాని పై తక్షణమే ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోవాలని తెలియజేయగానే ఎంక్వయిరీ చేసి ఎస్సీ హాస్టల్ వార్డెన్ భవాని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసును కేసులను నమోదు చేసినందుకు ఎన్ ఎస్ యు ఐ పక్షాన హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. కానీ దయచేసి హాస్టల్ వాడేళ్లు గాని ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు రాబోయే రోజులలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి విద్యార్థిని విద్యార్థులు మీయొక్క బిడ్డల లాగా చూసుకొని వారి చదువులు ముందుకు సాగే విధంగా మీరు వ్యవహరించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేయాలని ఎన్ ఎస్ యు ఐ పక్షాన మేము జిల్లా అధికారులను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో. రాజు, రాజశేఖర్, విజయభాస్కర్, తరుణ్, రాజేందర్,ప్రవీణ్,సాత్విక్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version