ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ పరంగా సూర్యకు రావాల్సినంత క్రెడిట్ రావడం లేదని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా సూర్యకు అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ.. బ్యాటర్‌గా రాణించాల్సిన అవసరం ఉందని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. దాదాపు ఏడాది కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డాడు. కెప్టెన్సీ విషయంలో అజేయంగా నిలుస్తున్నప్పటికీ.. సూర్య బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడంతో అభిమానుల నుంచి క్రికెట్ మాజీల వరకు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఫామ్ అందుకుని అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ ముందు స్కై ఫామ్ అందుకోవడం కాస్త ఊరటనిచ్చే విషయమే. ఈ నేపథ్యంలో సూర్య కెప్టెన్సీపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫార్ పఠాన్(Irfan Pathan) కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డ్ ఉంది. టీ20 ఫార్మాట్లో కెప్టెన్‌గా అతడికి విజయాల శాతం 84. ఇది చాలా ఎక్కువ. కానీ మనం సూర్యకుమార్‌కు ఇవ్వాల్సినంత క్రెడిట్ ఇవ్వడం లేదు. అలాగే సూర్య బౌలర్ల కెప్టెన్. అతడిలో రోహిత్ శర్మ ఛాయలున్నాయి. అతడు బౌలర్లపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు. జట్టు కోసం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాడు.
