టీమిండియా స్టార్ ప్లేయర్‌కు అస్వస్థత.. ఏమైందంటే…

టీమిండియా స్టార్ ప్లేయర్‌కు అస్వస్థత.. ఏమైందంటే?

 

 

టీమిండియా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మంగళవారం రాజస్థాన్‌తో జరిగిన సూపర్ లీగ్‌ మ్యాచ్ అనంతరం యశస్వి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. అతడిని వెంటనే పుణెలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించారు. స్కాన్ల అనంతరం అతడికి అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్స్(పొట్టలో తీవ్రమైన ఇన్ఫెక్షన్) ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ప్రస్తుతం యశస్వి(Yashasvi Jaiswal) ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. కాగా కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
కాగా రాజస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో జైశ్వాల్ అస్వస్థతతో ఉన్నప్పటికీ ముంబై తరపున మైదానంలోకి దిగాడు. బ్యాటింగ్ చేసే సమయంలో అతడు చాలా అసౌక్యరంగా కన్పించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైశ్వాల్ 16 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు.

అయినప్పటికీ..

యశస్వి జైస్వాల్(15) విఫలమైనప్పటికీ.. సూపర్ లీగ్ గ్రూప్ బీ మ్యాచులో అజింక్య రహానే(72*), సర్ఫరాజ్ ఖాన్(73) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో రాజస్థాన్ జట్టు ముంబైపై మూడు వికెట్ల తేడాతో ఓడింది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జైస్వాల్ మూడు మ్యాచ్‌లలో 48.33 సగటు, 168.6 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 145 పరుగులు సాధించాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్‌కు ముందు యశస్వీ జైస్వాల్ దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొని 78 సగటుతో 156 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version