సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం, నాణ్యతపై సంతృప్తి
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలంలోని రామతీర్థం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల విద్యార్థుల చదువు స్థాయి, క్రమశిక్షణ, లక్ష్య సాధనపై ఉపాధ్యాయులతో చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, పరిశుభ్రత, పోషకాహారం, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాధవి, యువ నాయకులు సందీప్, శ్రీకాంత్, గ్రామస్తులు గోరేమియా, సంజీవులు, విద్యార్థులు పాల్గొన్నారు.
