ట్రంప్ యుద్ధోన్మాదానికి మోడీ వత్తాసు–ప్రజలకు తీవ్ర నష్టం…

ట్రంప్ యుద్ధోన్మాదానికి మోడీ వత్తాసు–ప్రజలకు తీవ్ర నష్టం*

ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధాలతో ప్రపంచంలో చమురు, గ్యాస్ సంక్షోభం

ఎన్నికల హామీలను విస్మరించిన కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు

నర్సంపేట,నేటిధాత్రి:

 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదిపత్య ధోరణితో యుద్ధోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ దేశాల మధ్య విభేదాలు పెంచి ప్రపంచ అశాంతికి కారణమవుతున్నారని, అలాంటి విధానాలకు మోడీ ప్రభుత్వం వత్తాసు పలకడం సిగ్గుచేటని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు.ఎంసిపిఐ(యు) వరంగల్ జిల్లా కమిటీ సమావేశం నర్సంపేట పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ సింగతి మల్లికార్జున్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గాదగోని రవి మాట్లాడుతూ ఇరాన్–ఇజ్రాయిల్–అమెరికా యుద్ధాల వల్ల అమాయక ప్రజలు, మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని తెలిపారు.అమెరికా సామ్రాజ్యవాద విధానాలతో అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, యుద్ధాలను ప్రేరేపిస్తూ ఆయుధ వ్యాపారం కొనసాగించడం దుర్మార్గమని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధాలను వ్యతిరేకించి ప్రపంచ శాంతికి కృషి చేయాల్సిన మోడీ ప్రభుత్వం అమెరికా విధానాలకు మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రజలు యుద్ధ వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న బడ్జెట్లలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కేటాయింపులు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్లను వ్యతిరేకిస్తూ, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమలును నిరసిస్తూ ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి, కన్నం వెంకన్న, మంద రవి, జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుసుంబ బాబురావు, నాగేళ్లి కొమురయ్య, మాలోత్ సాగర్, ముక్కెర రామస్వామి, సుంచు జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version