రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కేవీ చౌదరి నియామకం…

రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కేవీ చౌదరి నియామకం

ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం

తిరుపతి(నేటిధాత్రి)సెప్టెంబర్ 27:

 

ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తిరుపతికి చెందిన కె.వి చౌదరి నీ ఎన్నుకున్నట్లు ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ రాష్ట్ర నేతలు ప్రకటించారు. శనివారం విజయవాడలో ఓ ప్రైవేట్ హోటల్లో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. తిరుపతికి చెందిన కె.వి చౌదరి గతంలో రాయలసీమ జోన్ చైర్మన్ ల గా కొనసాగారు. తాజాగా ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ నియమించడం జరిగింది.ఈ సందర్భంగా కె.వి చౌదరి మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడం పట్ల తనపై మరి ఎంత బాధ్యత పెరిగిందని చెప్పారు. ముఖ్యంగా వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఉండే వ్యాపారుల సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా వారి సమస్యలు పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అనుసంధానంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా జిఎస్టి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే వ్యాపారులకు నివృత్తి చేసి సమస్య లేకుండా చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ పదవి రావడం పట్ల రాష్ట్ర నేతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు

జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయండి.!

భారత కమ్యూనిస్టు పార్టీ
జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయండి.

బెల్లంపల్లి నేటిధాత్రి :

భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయండి ఆడెపు రాజమౌళి
23/03/2025 ఆదివారం,
సమయం:ఉదయం 10 గంటలకు కామ్రేడ్ బాశెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ సిపిఐ కార్యాలయం ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ బాశెట్టి గంగారం విజ్ఞాన్ భవన్లో బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి ఏఐటీయూసీ సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 1925లో ఆవిర్భవించింది, దున్నేవానికి భూమి ఉండాలని పేద ప్రజల అభ్యున్నతికై ప్రజా ఉద్యమాలను చేపట్టి ప్రజల పక్షాన నిలిచి ప్రజల కోసం పోరాటం చేసింది,సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నాము కావున నియోజకవర్గ ప్రజలు ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి కొంకుల రాజేష్ జిల్లా సంస్థ సభ్యులు గుండా చంద్ర మాణిక్యం మేకల రాజేశం నాయకులు రత్నం రాజం కుందేళ్ళ శంకర్ గుండా ప్రదీప్ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version