తీవ్ర గ్యాస్ కొరత….!
◆-: గ్యాస్ సిలిండర్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గృహిణులు.
◆-: ఈ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుంది?
◆-: చాలా గ్రామాల్లో గృహిణులు పాతకాలపు కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్నారు.
◆-: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలమైంది.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ఝరాసంగం కోహీర్ న్యాలకల్ మొగుడంపల్లి మండలంలో నూటికి 99 శాతం మంది గ్యాస్ పై ఆధారపడి ఉన్నారు అట్టి గ్యాస్ ఇటీవల తమకు సకాలంలో అందకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆయా గ్రామాల గృహిణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు లేని గ్యాస్ కొరత కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే ఎందుకు గ్యాస్ కొరత సృష్టిస్తున్నారని ఆయా గ్రామాల మహిళలు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాకుండా తమ పుల్కల్ మండలంలో ఉన్న భారత్ గ్యాస్ యజమాని, సిబ్బంది గ్యాస్ వినియోగదారుల పట్ల అవహేళనంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని పలువురు గ్రామ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా భారత్ గ్యాస్ సిబ్బంది తమ తీరును మార్చుకోకపోతే పరిణామాలు వేరే రకంగా ఉంటాయని పలు గ్రామాల లబ్దిదారులు అంటున్నారు.
ఈ విషయం ఇలా ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాక్ ఇరాక్ దేశాల్లో యుద్ధం నడవడం వల్ల అట్టి దేశాల నుంచి వచ్చే గ్యాస్ పెట్రోల్ డీజిల్ లాంటి దిగుమతులను వారు నిలిపియడంతో, మనకు వచ్చే గ్యాస్ పెట్రోల్ డీజిల్ అసలు వస్తుందా లేదా ఈ విషయంపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని సామాన్య గ్రామీణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారంలో ఉన్న పార్టీ నాయకులు స్పందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు తమకు సకాలంలో గ్యాస్ అందకపోతే తమ పరిస్థితి ఏంటని కొన్ని గ్రామాల మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము అదుకుంటాం అన్న మాట ఎక్కడికి వెళ్లి ళ్లిందని పలువురు అంటున్నారు ఇప్పటికే గ్యాస్ లేక తాము కట్టెల పొయ్యి పై వంటలు చేసుకుంటున్నామని పలు గ్రామాల మహిళలు అంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సకాలంలో తమకు గ్యాస్ ను అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు లేనియెడల అన్ని గ్రామాల ప్రజలు ఏకమై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని వారు అన్నారు,
