మద్దులపల్లిలో 8వ విడత గాలికుంటు టీకాలు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలంలోని మద్దులపల్లి గ్రామంలో జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం భాగంగా 8వ విడత గాలికుంటు నివారణ టీకా కార్యక్రమం డాక్టర్ రాజబాబు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెల్పుల సరిత పశువుల ఆరోగ్యంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు, ఫర్టిలిటీ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. గ్రామంలో పశువుల చికిత్స సౌకర్యాలు, కృత్రిమ గర్భధారణ సేవలు, పచ్చి గడ్డి విత్తనాల అందుబాటు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మొత్తం 116 పశువులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తిరుపతి, లక్ష్మణ్, సంతోష్, ముదాస్సిర్, ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, రైతులు సమ్మయ్య, బానేష్, ఓదేలు పాల్గొన్నారు.
