ఎరువుల షాపుల తనిఖీలు.
జిల్లా వ్యవసాయ అధికారి అజ్మీర శ్రీనివాసరావు
మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలంలోని పలు ఎరువుల దుకాణాలను మహబూబాబాద్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచారకులు అజ్మీరా శ్రీనివాసరావు కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న తో కలిసి తనిఖీ చేయడం జరిగింది, వారు మాట్లాడుతూ ప్రతి డీలరు రైతులకు యూరియా విధిగా యూరియా బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే సరఫరా చేయాలని వారు తెలిపారు, అదేవిధంగా ప్రతిరోజు స్టాక్ రిజిస్టర్ బ్యాలెన్స్ మరియు పి ఓ ఎస్ బ్యాలెన్స్, గోదాం బాలన్స్ సమానంగా ఉండేటట్లు చూసుకోవాలని ఆదేశించారు.
అనంతరం కేసముద్రం మండలంలోని తార్యతండ గ్రామ శివారులో వరి పంట క్షేత్రాలను గ్రామ రైతులతో కలిసి సందర్శించడం జరిగింది, ప్రస్తుతం వరిలో అగ్గి తెగులు, పాము పొడ తెగులు మోగి పురుగు మరియు జింక్ లోపాలను గమనించడం జరిగింది, వారు మాట్లాడుతూ అగ్గి తెగులు నివారణకు ట్రై సైక్లోజోల్ అనే మందు ఒక లీటర్ నీటికి 0.6 గ్రాములు కలిపి పిచికారి చేయాలని అదేవిధంగా పొడ తెగులు నివారణకు ప్రొపికొనోజోల్ అనే మందు ఒక లీటర్ నీటికి1 మిల్లీమీటర్, అదేవిధంగా మొగి పురుగు నివారణకు కాట్రాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే పురుగుమందు లీటర్ నీటికి రెండు గ్రాములు కలిపి పిచికారి చేయాలని, సూక్ష్మధాతు అయినా జింకు లోపాన్ని నివారించడానికి చీలేటెడ్ జింకు ఒక గ్రాము లేదా రెండు గ్రాములు ముడి జింకు కలిపి పిచికారి చేసి పైన తెలిపిన తెగుళ్లు మరియు పురుగులను నివారించవచ్చని వారు సూచించారు, అదేవిధంగా ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీ, యాసంగి పంట నమోదు తప్పకుంట చేయించుకోవాలని వారు సూచించారు .
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాధికారి బి.వెంకన్న, మరియు రైతులు మూడవత్ బుజ్జి శంకర్, రాజ్ కుమార్, రవీందర్, పాల్గొన్నారు.
