హరిచంద్ తండాలో ఎక్సైజ్, పోలీస్ అధికారుల దాడులు…

హరిచంద్ తండాలో ఎక్సైజ్, పోలీస్ అధికారుల దాడులు

అదుపులో ముగ్గురు వ్యక్తులు

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

మండలంలోని హరిచంద్ తండాలో నాటు సారా తయారీ, విక్రయాలు బహిరంగంగా కొనసాగుతున్నాయన్న సమాచారంతో నర్సంపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిఐ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో, స్థానిక నెక్కొండ సిఐ సన్నాయిల శ్రీనివాస్, ఎస్ఐ మహేందర్ వారి బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో సుమారు 2000 లీటర్ల గుడుంబా పానకం, 50 కిలోల బెల్లం, 10 కిలోల పట్టిక, 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో రాజావత్ రాము, జాటోతు కిట్టయ్య, జాటోతు బిక్షపతి అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న సారా, ఇతర సామగ్రిని నర్సంపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా పోలీసులు స్పష్టం చేస్తూ, గ్రామాల్లో నాటు సారా తయారీ, విక్రయాలు చేపట్టే సంఘ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version